తాజాగా త్రిష కృష్ణన్ షేర్ చేసిన పిక్స్ అభిమానులు, నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సినిమా స్థాయికి తగ్గట్టుగానే త్రిష ఫొటోషూట్లు చేస్తోంది. తన పాత్రను సూచించేలా పట్టుచీరలో దర్శనమిస్తోంది. చీరకట్టులోనూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. లేటెస్ట్ గా త్రిష బ్లాక్ అండ్ గోల్డ్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో అందాల విందు చేసింది.