బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. 25 ఏళ్ళ ఐరా ఖాన్.. అమీర్, రీనా దత్త లకు సంతానం. రీనా దత్తా అమీర్ ఖాన్ మొదటి భార్య. జునైద్ ఖాన్ కూడా వీళ్లిద్దరి కొడుకే. ఐరా ఖాన్ గత రెండేళ్లుగా నుపుర్ తో రిలేషన్ లో ఉంది. ఇటీవల తమ బంధాన్ని ఐరా ఖాన్ అధికారికంగా ప్రకటించింది.