చాలా కాలం తర్వాత ఇంటర్నెట్ లో తెగ సందడి చేస్తోంది త్రిష. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆమె పోస్టులను, గ్లామర్ ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. రీసెంట్ గా తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan 1) తో సాలిడ్ హిట్ అందుకుని రైజ్ అయ్యింది. ప్రస్తుతం సతురంగ వేట్టై పార్ట్ 2, రామ్ పార్ట్ 1, పొన్నియిన్ సెల్వన్ 2, ది రోడ్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.