Lucky Lakshman Review: `లక్కీ లక్ష్మణ్‌` రివ్యూ

First Published | Dec 30, 2022, 1:45 PM IST

సోహైల్‌ హీరోగా నటించిన చిత్రాల్లో `లక్కీ లక్ష్మణ్‌` మూవీ తొలి సినిమాగా విడుదలవుతుంది. అప్‌కమింగ్‌ మేకర్స్ ఏఆర్‌ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మించారు. నేడు శుక్రవారం(డిసెంబర్‌ 30) ఈ సినిమా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

బిగ్‌ బాస్‌ షో చాలా మందిని పాపులర్‌ చేసింది. అదే సమయంలో లైఫ్‌ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయి హీరో అయ్యాడు సోహైల్‌(సయ్యద్‌ సోహైల్‌)(Sohel). నాల్గో సీజన్‌ బిగ్‌ బాస్‌ షోలో ఆయన చేసిన రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. ఆ క్రేజ్‌తో హీరోగా అవకాశాలు సొంతం చేసుకున్నారు. ఒకేసారి నాలుగు సినిమాలకు సైన్‌ చేశాడు. సోహైల్‌ హీరోగా నటించిన చిత్రాల్లో `లక్కీ లక్ష్మణ్‌` మూవీ తొలి సినిమాగా విడుదలవుతుంది. అప్‌కమింగ్‌ మేకర్స్ ఏఆర్‌ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మించారు. నేడు శుక్రవారం(డిసెంబర్‌ 30) ఈ సినిమా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. Lucky Lakshman Review.
 

కథః 
లక్కీ లక్ష్మణ్‌(సోహైల్‌) మామూలు మధ్య తరగతి కుటుంబంలో పెరిగిన కుర్రాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్కూల్‌, కాలేజ్‌లో ఎలాంటి ఎంజాయ్‌ మెంట్‌ లేకుండా చదువే లక్ష్యంగా పెరుగుతుంటాడు. ఫస్ట్ కెరీర్‌ పరంగా సెటిల్‌ అయి ఆ తర్వాత ఎంజాయ్‌ చేయాలనే నాన్న ఒత్తిడి మేరకు ప్రేమకి, అమ్మాయిలకు దూరంగా పెరుగుతుంటాడు. చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేని స్థితిలో నాన్న(దేవి ప్రసాద్‌)ఉంటాడు. దీంతో నాన్న అంటే ద్వేషం పెంచుకుంటాడు లక్ష్మణ్‌. పేరెంట్స్ కి దూరంగానూ ఉంటాడు. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌లో చేరిన తొలి రోజే రిచ్‌ అమ్మాయి శ్రేయా(మోక్ష) పరిచయం అవుతుంది. ఆమె లక్ష్మణ్‌ని సిన్సియర్‌గా ప్రేమిస్తుంది. అయితే మరో అమ్మాయి తన లైఫ్‌లోకి రావడంతో శ్రేయా బ్రేకప్‌ చెబుతుంది. దీన్ని లైట్‌ తీసుకున్న లక్ష్మణ్‌.. ఆ కసితో తాగిన మత్తులో మ్యారేజ్‌ బ్యూరో పెట్టాలనే ఆలోచనకు వస్తాడు. దాన్నే నిజం చేస్తాడు. రిచ్‌ ఫ్యామిలీస్‌ లక్ష్యంగా మ్యారేజ్‌లు సెట్‌ చేస్తాడు. ఈ క్రమంలో వేగంగా మంచి స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో పేరెంట్స్ ని వదిలేస్తాడు. మ్యారేజ్‌ బ్యూరో పరంగా ఆర్థికంగా రిచ్‌గా ఎదిగిన లక్ష్మణ్‌కి ఒకానొక దశలో ప్రేమ గుర్తొస్తుంది. మరి తన ప్రియురాలిని ఎలా తన వశం చేసుకున్నాడు? తన పేరెంట్స్ అంతటి పేదరికంలో ఉండటానికి కారణమేంటి? ప్రేమ, బంధాలకంటే డబ్బుకే ప్రయారిటీ ఇచ్చే లక్ష్మణ్‌లో వచ్చిన మార్పేంటి? అనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః
 బిగ్‌ బాస్‌ సోహైల్‌ అంటే మాస్‌ ఇమేజ్‌ క్రియేట్‌ అయ్యింది. హౌజ్‌లో చికెన్‌ మటన్‌ అంటూ రచ్చ చేశాడు. కథ వేరే ఉంటదని హంగామా చేశాడు. తనకంటూ ఎంతో కొంత ఫాలోయింగ్స్ ని, ఫ్యాన్స్ ని ఏర్పర్చుకున్నాడు. దీంతో ఆయన హీరోగా నటించే సినిమా అంటే అలాంటి మాస్‌ ఎలిమెంట్స్ ఊహిస్తారు. ఆ విషయంలో ఈ చిత్రం కాస్త డిజప్పాయింట్‌ చేస్తుంది. అయితే సోహైల్‌ ముందుగా ఒప్పుకున్న సినిమా వేరే, కానీ విడుదలైన సినిమా వేరు, పరిస్థితుల కారణంగా సీన్‌ రివర్స్ అయ్యింది. దీంతో ఇప్పుడు లవ్‌, ఎమోషన్స్ కూడిన క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వచ్చాడు. `లక్కీ లక్ష్మణ్‌` రెగ్యూలర్‌ లవ్‌ స్టోరీ. ఫాదర్‌ ఎమోషన్స్ ఇందులో హైలైట్‌ పాయింట్‌. నేటి సమాజంలో ప్రేమ, బంధాల కంటే డబ్బుకే ప్రయారిటీ ఇస్తున్నారనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించారు దర్శకుడు అభి. అయితే అందుకు రెగ్యూలర్‌ ఫార్మాట్‌ని ఎంచుకోవడం కాస్త రొటీన్‌ ఫీలింగ్‌ని తీసుకొస్తుంది. 

సినిమా మొదటి భాగం సరదాగా సాగుతుంది. స్కూల్‌ లో ఫ్రెండ్స్ చేసే అల్లరి, అలాగే తాను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లలేని స్థితిని చూపించారు. కాలేజ్‌లో అమ్మాయితో లవ్‌ స్టోరీ హైలైట్‌ చేశారు. ఈ సన్నివేశాలు చాలా వరకు క్యూట్‌గానే ఉంటాయి. టైమ్‌ పాస్‌గా సాగిపోతుంటాయి. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు యూత్‌కి ఆకట్టుకునేలా ఉంటాయి. అదే సమయంలో రొటీన్‌గానే అనిపిస్తుంటాయి. సెకండాఫ్‌లో కథ మొత్తం వేరేలా ఉంటుంది. ద్వితీయార్థంలో ఫ్రెండ్స్, మ్యారేజ్‌ బ్యూరో చుట్టూ తిరుగుతుంది. ఆయా సీన్లు ఫాస్ట్ గా జరిగిపోతుంటాయి. ఈ క్రమంలో పుట్టే ఫన్‌, డ్రామా ఆసక్తికరంగా సాగుతుంది. చివర్లో ఫాదర్‌ సెంటిమెంట్‌ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. అదే సినిమాకి బ్యాక్‌ బోన్‌. పిల్లల కోసం పేరెంట్స్ ఎంతటి త్యాగాలు చేస్తారని చెప్పే సందేశం, ఫాదర్‌ విలువని తెలిపే సందేశం ఆకట్టుకుంది. సగటు ఆడియెన్స్ హృదయాలను బరువెక్కిస్తుంది. పేరెంట్స్ ని తక్కువగా చూసే వారికి ఒక చెంపపెట్టులాంటి సినిమా అవుతుంది. 
 

అయితే సినిమా నడిపించిన తీరు విషయంలో దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. ఈ విషయంలో కొంత అనుభవ లేమి కనిపిస్తుంది. స్కూల్‌, కాలేజ్‌ సన్నివేశాల్లో ఇంకాస్త ఫన్‌ జనరేట్‌ చేయాల్సింది. ఫన్‌ సీన్లని మరింత గ్రిప్పింగ్‌గా రాసుకుని ఉండాల్సింది. లవ్‌ సీన్లు కూడా ఇంకాస్త డెంప్త్ పెట్టి, ఎమోషన్స్ జోడించి ఉంటే కథ వేరేలా ఉండేది. మరోవైపు ఫాదర్‌ సెంటిమెంట్‌, ఫాదర్‌, సన్‌ మధ్య సీన్లు మరిన్ని పెట్టి, మరింత బలంగా వాటిని డిజైన్‌ చేస్తే, కమర్షియల్‌ అంశాలు, ఫైట్స్ సీన్లులాంటివి జోడిస్తే సినిమా ఫలితం వేరేలా ఉండేది. మొత్తానికి సోహైల్‌కి ఇదొక మంచి ప్రయత్నంగానే మిగిలిపోయింది. 

నటీనటులః
లక్కీ లక్ష్మణ్‌గా సోహైల్‌ హీరోగా సినిమాని తన భుజాలపై మోశాడు. ఫన్‌, ఎమోషన్స్, స్వార్థం, ఇలా అన్ని యాంగిల్స్ ని చూపించాడు. తొలి చిత్రంతోనే హీరోగా అదరగొట్టాడు. హీరోగా మంచి ఫ్యూచర్‌ ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పెద్ద హిట్‌ పడితే నెక్ట్స్ రేంజ్‌ హీరో అవుతాడు. శ్రేయాగా మోక్ష చాలా బాగా నటించింది. ఆమె అందంగానే కాదు, నటన కూడా బాగుంది. తండ్రి పాత్రలో దేవి ప్రసాద్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమీర్‌ ఓకే అనిపించారు. సోహైల్‌ ఫ్రెండ్స్ గా చేసిన నటుడు ఆకట్టుకున్నారు. బాల నటులు కూడా బాగా చేశాడు. . కాదంబరి కిరణ్‌ చివర్లో కాసేపు కనిపించి అదరగొట్టాడు. 

టెక్నీషియన్లుః 

దర్శకుడు అభి దర్శకుడిగా తొలి ప్రయత్నం బాగుంది. దర్శకుడిగా మెప్పించాడు. లవ్‌, ఫన్‌, ఫ్యామిలీ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. వాటిని ఇంకా గ్రిప్పింగ్‌గా, బలంగా చేస్తే దర్శకుడిగా ఆయనకు మరింత మంచి పేరు వచ్చేది. ఆండ్రూ కెమెరా వర్క్ బాగుంది. అనూప్‌ రూబెన్స్ మ్యూజిక్‌ కూడా సినిమాకి హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకా కొంత కట్‌ చేయాల్సింది. దీంతో మరింత క్రిస్పిగా ఉండేది. ఇక నిర్మాణ విలువలకు కొదవలేదు. సోహైల్‌ వంటి అప్‌ కమింగ్‌ హీరోకి బాగానే ఖర్చు చేశారు. వారు పడ్డ శ్రమ కనిపిస్తుంది. 

ఫైనల్‌గాః ఓవరాల్‌గా తండ్రి వ్యాల్యూని తెలియజేసే చిత్రమవుతుందని చెప్పొచ్చు. డబ్బు కంటే బంధాలు, ప్రేమ గొప్పదని చెప్పిన చిత్రంగా నిలుస్తుంది. 

రేటింగ్‌ః 2.5
 

Latest Videos

click me!