అప్పుడు అభి కైలాష్ తో గిల్లించుకొని మరి ఇది నిజమే అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత సులోచన,మాలిని ఇద్దరు కలిసి రాజారాణికి ఫోన్ చేస్తారు. అప్పుడు రాజారాణి యష్ వేదల గురించి గొప్పగా చెప్పడంతో మాలిని, సులోచన సంతోష పడుతూ ఉంటారు. మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు వీరిద్దరూ చిలక గోరింకల్లాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఊరు మొత్తం తిరిగి వచ్చారు అనడంతో మాలిని,సులోచన ఇద్దురు సంతోషపడుతూ ఉంటారు. తర్వాత యష్,వేద ఇద్దరు నీటి దగ్గర చేతులు కాళ్లు కడుక్కుంటూ బురద శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వారు ఒకరి వైపు ఒకరు అలాగే చూసుకుంటూ ఉంటారు.