Trisha Krishnan: విజయ్ దళపతి లైఫ్‌లో కలకలం రేపిన త్రిష.. నటించిన టాప్ 5 బ్లాక్‌ బస్టర్ సినిమాలు

Published : Mar 08, 2026, 10:00 AM IST

సూపర్‌స్టార్‌ దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ భార్య సంగీత సోర్నలింగం విడాకుల కోసం దరఖాస్తు చేశారని వార్తలొస్తున్నాయి. ఈ గొడవలకు  త్రిష కృష్ణన్ కారణమని  కథనాలు వస్తున్న క్రమంలో త్రిష నటించిన టాప్ 5 సినిమలు చూద్దాం. 

PREV
16
త్రిష కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన 5 సినిమాలు

దళపతి విజయ్ వ్యక్తిగత జీవితంలో త్రిష కృష్ణన్ కలకలం రేపినట్లు పుకార్లు వస్తున్నాయి. ఆమె వల్లే విజయ్ భార్య విడాకులకు అప్లై చేసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో త్రిష కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన 5 సినిమాల గురించి తెలుసుకుందాం.

26
విజయ్ జోడీగా నటించిన సినిమానే టాప్.

త్రిష కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా 'లియో'. 2023లో వచ్చిన ఈ సినిమాలో దళపతి విజయ్ హీరో. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 615 కోట్లు వసూలు చేసింది.

36
త్రిషను రెండో సారి హీరోయిన్ గా మార్చిన సినిమా..?

2022లో వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1' ఒక మల్టీస్టారర్ సినిమా. ఇందులో విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కార్తి, జయరాం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా రూ. 488 కోట్ల కలెక్షన్ సాధించింది. ఈసినిమా వల్ల త్రిషకు సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్ గా అవకాశాలు పెరిగిపోయాయి. 

46
సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోయిన త్రిష..

త్రిష కెరీర్‌లో ఎక్కువ వసూళ్లు చేసిన సినిమాల్లో 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2' కూడా ఒకటి. 2023లో రిలీజైన ఈ మల్టీస్టారర్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 345 కోట్ల బిజినెస్ చేసింది.

56
248 కోట్ల బిజినెస్ చేసిన సినిమా?

త్రిష నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా 2025లో విడుదలైంది. అజిత్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన లభించింది. ఈ మూవీ రూ. 248 కోట్ల బిజినెస్ చేసింది.

66
రజినీకాంత్ జోడీగా..

'పేట' 2019లో వచ్చిన యాక్షన్ డ్రామా సినిమా. ఇందులో త్రిషతో పాటు రజినీకాంత్, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శశికుమార్, సిమ్రాన్ నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లు వసూలు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories