వెంకటేష్ నటించిన ఓ సినిమా ఏ మాస్ హీరోకి సాధ్యంకాని రికార్డుని నెలకొల్పింది. ఆ మూవీ రిలీజై 26 ఏళ్ళు గడిచినా ఇంకా ఆ రికార్డు చెక్కు చెదరలేదు. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.
విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో మాస్ సినిమాలు చేశారు. కానీ మాస్ కంటే ఎక్కువగా ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆధారణ ఎక్కువ లభించింది. దీనితో ఒక దశలో వెంకీ పూర్తిగా ఫ్యామిలీ సినిమాలకు షిఫ్ట్ అయిపోయారు. కుటుంబ కథా చిత్రాలతోనే వెంకటేష్ చిరంజీవి, బాలయ్యలకు ధీటుగా ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పారు.
25
ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన కుటుంబకథా చిత్రం
వెంకటేష్ నటించిన కలిసుందాం రా మూవీ ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కి గురిచేసేలా అనేక రికార్డులు సొంతం చేసుకుంది. అంతకు ముందు వచ్చిన బాలకృష్ణ సమారా సింహారెడ్డి కలెక్షన్స్ ని అధికమించి ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది. దీనికన్నా మరో గొప్ప రికార్డు ఈ సినిమా పేరుపై, విక్టరీ వెంకటేష్ పై నమోదయ్యాయి.
35
చిరు, బాలయ్యకి కూడా సాధ్యంకాని రికార్డ్
ఆ రికార్డు ఏంటంటే.. ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో 50 రోజులు, 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇది టాలీవుడ్ లో వెంకటేష్ కి తప్ప ఇంకే హీరోకి సాధ్యం కాని రికార్డ్ అనే చెప్పాలి. కలిసుందాం రా కంటే బిగ్గెస్ట్ హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ అవేమీ విడుదలైన అన్ని కేంద్రాల్లో 50 రోజులు, 100 రోజులు ఆడలేదు. కలిసుందాం రా లాంటి ఫ్యామిలీ డ్రామాతో వెంకటేష్.. మాస్ హీరోలైన చిరు, బాలయ్యలకు కూడా సాధ్యంకాని రికార్డ్ సొంతం చేసుకున్నారు.
ఇక ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం అసాధ్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు నెల రోజులు ఆడడం కూడా కష్టం అయిపోతోంది. ఈ చిత్రానికి వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు, తండ్రి రామానాయుడు నిర్మించారు. ఎస్ ఏ రాజ్ కుమార్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం ఆనందించారు.
55
అవార్డుల పంట
ఈ చిత్రంలో సిమ్రాన్ హీరోయిన్. అప్పట్లోనే ఈ చిత్రం 30 కోట్ల వరకు గ్రాస్ రాబట్టి అతి పెద్ద విజయం గా నిలిచింది. ఉత్తమ తెలుగు ఫీచర్ ఫిలిం విభాగంలో ఈ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. ఉత్తమ నటుడిగా వెంకటేష్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు.