Trisha Krishnan: త్రిష సినిమాలు మానేస్తుందని కోలీవుడ్‌లో పెద్ద చర్చే నడిచింది. దీంతో అభిమానులు చాలా కంగారుపడ్డారు. ఇప్పుడు ఆ పుకార్లన్నింటికీ త్రిష ఫుల్ స్టాప్ పెట్టింది. గుడ్ న్యూస్ చెప్పింది.
సౌత్ ఇండియా 'కుందవై' త్రిష కృష్ణన్ మళ్లీ వార్తల్లో నిలిచింది. సెప్టెంబర్ మొదలవగానే లండన్ వీధుల నుంచి ఒక హాట్ న్యూస్ చెప్పింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే త్రిష, తన అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తూ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. త్రిష సినిమాలు మానేస్తుందా? కొత్త ప్రాజెక్టులు ఎందుకు ఒప్పుకోవట్లేదు? లాంటి రూమర్లకు ఈ ప్రకటనతో ఆమె ఫుల్ స్టాప్ పెట్టింది.
25
ముగ్గురు హీరోయిన్ల కథతో త్రిష సినిమా
ఇది కేవలం సినిమా ప్రకటన మాత్రమే కాదు, ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే 'సైకలాజికల్ థ్రిల్లర్' కావడం స్పెషల్. బాలీవుడ్ ఫేమస్ 'పనోరమా స్టూడియోస్' ('దృశ్యం' సినిమా నిర్మాణ సంస్థ) ఈ చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఇందులో త్రిషతో పాటు సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, టాలెంటెడ్ యాక్ట్రెస్ అపర్ణా బాలమురళి కలిసి నటిస్తున్నారు. ఈ ముగ్గురు పవర్‌ఫుల్ నటీమణులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం సినిమాలో కంటెంట్ ఎంత బలంగా ఉందో చెబుతోంది.
35
సైకలాజికల్ హర్రర్ గా త్రిష కొత్త మూవీ
అక్షయ్ కుమార్ 'ఎయిర్‌లిఫ్ట్', సైఫ్ అలీ ఖాన్ 'చెఫ్' లాంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన రాజా కృష్ణ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయనకు మొదటి తమిళ సినిమా, అలాగే మొదటి సైకలాజికల్ హర్రర్ చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మంచుతో కప్పబడిన లండన్ నగరంలో సైలెంట్‌గా జరుగుతోంది. దీనికోసమే త్రిష లండన్‌లో ఉంది. మిస్టరీ, థ్రిల్, సస్పెన్స్ నిండిన ఈ కథ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఇటీవల త్రిష నటించిన ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. దాని తర్వాత ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవితో త్రిష నటించిన 'విశ్వంభర' సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
55
త్రిష మూవీ కోసం అభిమానులు వెయిటింగ్
'దృశ్యం' లాంటి అద్భుతమైన చిత్రాలు అందించిన నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మొత్తానికి, సెప్టెంబర్ నెల త్రిషకు బాగా కలిసొచ్చింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కోసం ఆమె అభిమానులు ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌తో త్రిష సినిమాలు మానేస్తుందన్న పుకార్లకు పూర్తిగా తెరపడింది.