మరి `టాక్సిక్` మూవీ థియేట్రికల్ బిజినెస్ ఎంత? ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది? నిర్మాతలు, బయ్యర్లు సేఫ్ అవుతారనేది చూస్తే, ఇక `టాక్సిక్` మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ.105కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. ఇందులో నైజాంలో రూ.45కోట్లు, సీడెడ్‌లో రూ.15కోట్లు, ఆంధ్రాలో మరో రూ.45కోట్లు అయ్యిందని సమాచారం. కర్నాటకలో రూ.100కోట్లకు, తమిళనాడులో రూ.45కోట్లకు, కేరళాలో రూ.15కోట్లకు, నార్త్ లో రూ.75కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.15కోట్లకు అమ్మారట. ఓవర్సీస్ రైట్స్ మరో రూ.70కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. మొత్తంగా రూ.425కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. సినిమా హిట్ కావాలంటే రూ.850కోట్ల గ్రాస్ రాబట్టాలి. ఇప్పటి వరకు సుమారు రూ.160కోట్ల వరకు షేర్ వచ్చింది. ఇంకా రూ.265కోట్ల షేర్ రావాలి. అంటే ఐదు వందల కోట్ల వరకు గ్రాస్ రాబట్టాలి. అది కష్టమనే చెప్పాలి.