
2002లో ‘మౌనం పెసియదే’ అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన త్రిష, ‘మనసెల్లామ్’, ‘సామి’, ‘గిల్లి’, ‘తిరుప్పాచి’ వంటి హిట్ సినిమాల్లో నటించారు.
ప్రభాస్‌తో `వర్షం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తొలి మూవీతోనే విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో కూడా పాగా వేసింది. `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `అతడు`, `అల్లరి బుల్లోడు`, `పౌర్ణమి`, `స్టాలిన్`, `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే` చిత్రాలతో ఆకట్టుకుంది. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది.
ప్రస్తుతం చిరంజీవితో ‘విశ్వంభర’, అలాగే ‘కరుప్పు’ సినిమాల్లో నటిస్తున్నారు. ఆమె నటించిన ‘థగ్ లైఫ్’ సినిమాలోని ఆమె పాత్రకు విమర్శలు వచ్చాయి.
చాలా మంది నటులు, నటీమణులు ఏదో ఒకటి మాట్లాడి వివాదాల్లో చిక్కుకుంటారు. కానీ 25 సంవత్సరాలకు పైగా సినీ రంగంలో అగ్ర నటిగా వెలుగొందుతున్న త్రిషపై ఎలాంటి వివాదాలు రాలేదు.
కానీ ఇటీవల కాలంలో త్రిషని విజయ్‌తో డేటింగ్‌లో ఉందని, ఇద్దరు ప్రేమించుకుంటున్నారనే వార్తలతో ఆమె విమర్శలపాలు అవుతుంది. విజయ్‌ను విమర్శించడానికి చాలా మంది త్రిషని ఉపయోగించుకుంటున్నారు.
ముఖ్యంగా విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించిన తర్వాత విజయ్, త్రిషలను జోడించి మీమ్స్, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ప్రత్యర్థులు నానా రచ్చ చేస్తున్నారు. బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
విజయ్, త్రిష ఇద్దరూ మంచి స్నేహితులు. వీళ్లిద్దరూ 2004లో వచ్చిన ‘గిల్లి’ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు.
ఇటీవల ‘లియో’ సినిమాలో జంటగా నటించారు. ‘గోట్’ సినిమాలో ఒక పాటకు కలిసి డాన్స్ చేశారు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష ఆయనకు ఫోటో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఫోటో వైరల్ అయ్యింది. దీంతో మరోసారి విజయ్, త్రిషల రిలేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందంటున్నారు. త్రిషని ట్రోల్ చేస్తున్నారు.
ఈ విమర్శలకు కారణం కీర్తి సురేష్ పెళ్లి. కొన్ని నెలల ముందు జరిగిన కీర్తి సురేష్ పెళ్లికి విజయ్, త్రిష ప్రైవేట్ జెట్‌లో వెళ్లడం విమర్శలకు దారితీసింది. అప్పటి నుంచి ఇద్దరిపై విమర్శలు వస్తున్నాయి.
విజయ్ 51వ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపిన త్రిష.. విజయ్ తన కుక్కపిల్లతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇందులో పక్కనే తను కూడా ఉంది. నెటిజన్లు ఈ ఫోటోను షేర్ చేసి ట్రోల్ చేస్తున్నారు.
తనను విమర్శిస్తున్న వారికి త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో కౌంటర్ ఇచ్చారు. "మనం ప్రేమతో నిండి ఉన్నప్పుడు, అది చెడు ఆలోచనలు ఉన్నవారిని కలవరపెడుతుంది" అని పోస్ట్ చేశారు.
ఆమె పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తనను విమర్శిస్తున్న వారికి ఈ పోస్ట్ పెట్టినట్లు చాలా మంది అంటున్నారు.