రీసెంట్ గా పవన్ కల్యాణ్ తమిళనాడులోని మధురైలో జరిగిన "మురుగన్ మానాడు" అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సభలో పవన్ నాస్తికులు, సెక్యులరిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, హిందుత్వం, సనాతన ధర్మం వంటి అంశాలను ప్రస్తావించారు.
పవన్ తన ప్రసంగంలో "నాస్తికులకు ఏ దేవుడినీ నమ్మాల్సిన అవసరం లేదు. కానీ మన దేశంలో సమస్య ఏమిటంటే, నాస్తికులు ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నారు" అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర చర్చకు దారితీశాయి.