actress Trisha Krishnan
త్రిష.. తెలుగులో చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. కానీ తమిళంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఆమె ఇప్పుడు చిరంజీవితో `విశ్వంభర` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు తమిళంలో అజిత్ సరసన బాక్ టూ బాక్ సినిమాలు చేసింది. ఆ మధ్య `పట్టుదల` చిత్రంలో నటించింది. అది పెద్దగా ఆడలేదు. ఇప్పుడు `గుడ్ బ్యాడ్ అగ్లీ` మూవీ మంచి వసూళ్లని రాబడుతుంది. ఈ క్రమంలో కమల్ హాసన్, శింబు నటించిన `థగ్ లైఫ్` చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుంది.
`థగ్ లైఫ్` సినిమా ప్రమోషన్స్ లో భాగంగా త్రిష తన పెళ్లిపై స్పందించింది. మ్యారేజ్ పై ఒపీనియన్, పెళ్లిఎప్పుడు అనే ప్రశ్నకి త్రిష స్పందిస్తూ, సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. తనకు పెళ్లిపై నమ్మకం లేదని చెప్పింది. మ్యారేజ్ అయినా ఓకే, కాకపోయినా ఓకే అని చెప్పి షాకిచ్చింది. పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే దానికి తన వద్ద సమాధానం లేదని, పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో తనకే తెలియదని చెప్పింది త్రిష.
Trisha
తన మ్యారేజ్‌పై ఓ సందర్భంలో మాట్లాడుతూ, తన మనసుకి నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా చేసుకుంటానని, తనని పెళ్లి చేసుకోబోయేవాడు జీవితాంతం తనకు తోడుగా ఉండాలనే నమ్మకం కలగాలని, అప్పుడే మ్యారేజ్ చేసుకుంటానని వెల్లడించింది. పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం తనకు ఇష్టం లేదని, చాలా మంది మ్యారేజ్ చేసుకుని అసంతృప్తితో జీవిస్తున్నారు. అలాంటి లైఫ్ తనకు వద్దు అని చెప్పింది త్రిష.
Trisha Krishnan
ఇదిలా ఉంటే త్రిష.. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్‌తో ప్రేమలో ఉన్నట్టు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య `ది గోట్` మూవీలో త్రిష ఐటెమ్ సాంగ్ కూడా అందుకే పెట్టారని అన్నారు. విజయ్ తన భార్యకి విడాకులిచ్చి త్రిషని మ్యారేజ్ చేసుకోబోతున్నాడనే రూమర్లు వచ్చాయి. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన నేపథ్యంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు త్రిష చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చ అవుతున్నాయి. ఆమె విజయ్‌ని ఉద్దేశించే మాట్లాడిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.