Trisha: 3 సినిమాలు, 1200 కోట్లు, ముగ్గురు హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిన త్రిష

Published : May 28, 2026, 08:35 AM IST

విజయ్ దళపతి సీఎం అయినప్పటి నుంచి హీరోయిన్ త్రిష మరింత పాపులర్ అయ్యింది. ఏదో ఒక కరకంగా వార్తల్లో నిలుస్తుంది త్రిష. కోలీవుడ్ లో ముగ్గురు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇంతకీ విషయం ఏంటంటే? 

PREV
16
43 ఏళ్ల వయసులో తగ్గేది లేదంటున్న త్రిష

సౌత్ సీనియర్‌ హీరోయిన్లలో త్రిషది ప్రత్యేక స్థానం. ఎవరైనా హీరోయిన్ గా టైమ్ అయిపోగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంటారు. కానీ త్రిషమాత్రం కొన్నేళ్లు బ్రేక్ ఇచ్చి.. మళ్లీ హీరోయిన్ గానే రీఎంట్రీ ఇచ్చింది. 43 ఏళ్ల వయసులో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ.. సీనియర్ హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా మారిపోయింది. 20 ఏళ్లకు పైగా హీరోయిన్ గా కెరీర్‌ కొనసాగిస్తున్న ఆమె.. ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గా తన క్రేజ్‌ను కొనసాగిస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు త్రిష లక్కీ ఛార్మ్‌గా మారిపోయిందంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

26
ముగ్గరు హీరోలకు అదృష్ట దేవత..

రీసెంట్ గా రిలీజ్ అయిన వీరభద్రుడు (కరుప్పు) సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో త్రిష పేరు మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఈ సినిమా విజయంతో అభిమానులు ఆమెను అదృష్ణ దేవతగా అభివర్ణిస్తున్నారు. ఓ అభిమాని సోషల్ మీడియాలో చేసిన పోస్టును త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో అది మరింత వైరల్ అయింది.

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా ఉన్న అజిత్ కుమార్‌, విజయ్‌, సూర్య విజయాలకు త్రిషను ముడిపెడుతూ.. సోషల్ మీడియా పోస్ట్ లు ప్రత్యక్ష్యం అవుతున్నాయి. ఈ ముగ్గురు హీరోల తాజా విజయాల్లో త్రిష పాత్ర ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమాలే ఈ హీరోలకు కెరీర్ బెస్ట్ హిట్లుగా నిలిచాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

36
విజయ్ సీఎం అవ్వడానికి త్రిష ఏం చేసింది?

2023లో విడుదలైన ‘లియో’ సినిమా విజయ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈసినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు. అంతే కాదు రీసెంట్ గా దళపతి విజయ్ తమిళనాడు సీఎం అయ్యారు. ఆయన సీఎం అవ్వడానికి త్రిష ప్రత్యేక పూజలు చేసినట్టు సమాచారం. త్రిష బర్త్ డే రోజే ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. విజయ్ టీవీకే పార్టీ భారీ విజయాన్ని సాధించింది. విజయ్ త్రిషను పెళ్లాడతాడని, డిప్యూటీ సీఎం ను చేస్తాడని, రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

46
అజిత్ కు కలిసొచ్చిన త్రిష..

ఇక మరో స్టార్ హీరో అజిత్ కి కూడా త్రిష లక్కీ హీరోయిన్ గా మారింది. 2025లో విడుదలైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ద్వారా అజిత్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలొ అజిత్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. ఈమూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.248 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అజిత్ కెరీర్‌లో బెస్ట్ హిట్‌గా నిలిచింది.

56
చాలా కాలం తరువాత సూర్యకు హిట్టు..

ఇక సూర్య నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా రూ.300 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. చాలా కాలంగా ప్లాప్ సినిమాలతో సతమతం అవుతున్న సూర్యకు తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ తగిలింది. ఇలా ఈ మూడు సినిమాల్లో త్రిష హీరోయిన్‌గా నటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

66
1200 కోట్ల కలెక్షన్స్..

‘లియో’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘కరుప్పు’ సినిమాల వసూళ్లు కలిపితే దాదాపు రూ.1200 కోట్లకు చేరుతున్నాయి. దీంతో త్రిషను అభిమానులు స్టార్ హీరోలకు లక్కీ ఛార్మ్‌గా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు ఆమె ప్రభావం తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా కొనసాగుతుందా అనే ఆసక్తి నెలకొంది.త్రిష తదుపరి చిత్రం మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. దీంతో ఈ చిత్రం ద్వారా త్రిష మరో విజయాన్ని అందుకుంటుందా అనే చర్చ ఇప్పటికే మొదలైంది.

Read more Photos on
click me!

Recommended Stories