సీరియల్ లో వేషం కోసం కమిట్మెంట్స్... ఒంటరి ఆడదాన్ని అని.. పారిపోదాం అనుకున్నా

First Published Apr 22, 2024, 11:24 AM IST

కానీ ఎక్కడికి వెళ్లినా కూడా.. ఒంటరి ఆడది అనేసరికి చిన్న చూపు ఉండేది.నేను సింగిల్ అనేసరికి చాలా ఇబ్బంది పెట్టేవారు.

Pavitra Jayaram


త్రినయని సీరియల్‌లో తిలోత్తమగా విలనిజం పండిస్తున్నపవిత్ర జయరామ్ గురించి తెలియని తెలుగు ఆడవాళ్లు ఉండరు.  కన్నడ నటి అయిన పవిత్రా జయరామ్ తెలుగులోనూ క్లిక్ అవటం  వెనక చాలా కృషి, పట్టుదల ఉంది. ఎన్నో అవమానాలు, బాధలు ఎదురైనా మొక్కవోని విశ్వాసంతో,తనపై నమ్మకంతో ఆమె ముందుకు వెళ్లి చాలా సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. ఆమె నటించిన జీతెలుగు ‘త్రినయని’ సీరియల్ భీబత్సంగా క్లిక్ అవ్వటంతో మీడియాతో మాట్లాడి తన పర్శనల్ విషయాలు సైతం షేర్ చేసుకుంది.

Pavitra Jayaram


పవిత్రం జయరామ్ మాట్లాడుతూ.... నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనే తపనతో మా మాండ్య నుంచి బెంగళూరు వచ్చాను. నేనేం పెద్దగా చదువుకోలేదు. కొన్నిరోజులు హౌజ్‌ కీపింగ్‌ వర్క్‌ చేశాను. బట్టల దుకాణంలో, లైబ్రరీలో ఉద్యోగాలు చేశాను. అయితే నా టార్గెట్ జీవితంలో ఎదగాలనే. అయినా కొంతకాలం తిప్పలు పడేదాకా నాకు కాలం కలిసి రాలేదు. 

Latest Videos


Pavitra Jayaram

 నా ఇబ్బందులు గమనించి ఓ మిత్రుడు సిరిగంధం శ్రీనివాసమూర్తి అనే డాక్యుమెంటరీ ఫిలిం మేకర్‌ నంబర్‌ ఇచ్చారు. వెళ్లి కలిశాను. అప్పటికే ఆయన గిరిజనుల మీద డాక్యుమెంటరీ చిత్రాలు రూపొందిస్తున్నారు. డైరెక్షన్‌ టీమ్‌లో నాకు ఉద్యోగం ఇచ్చారు. అలా నాకు కెమెరా, సినిమా పరిచయం అయింది. ఆ తర్వాత సీరియల్స్ వైపు మ్రొగ్గు చూపాను.

Pavitra Jayaram

కన్నడ సీరియల్స్‌లో నటించాలనే ఆలోచన వచ్చింది. ఆడిషన్స్‌కి వెళ్లాను. చిన్నచిన్న పాత్రలు వచ్చేవి. అదే సమయంలో ‘జోకాలి’ అనే సీరియల్‌లో హీరో చెల్లెలి పాత్ర దొరికింది. ఆ తర్వాత తెలుగులో ‘నిన్నే పెళ్లాడుతా’లో అవకాశం వచ్చింది. అప్పటికి నాకు తెలుగు ఏ మాత్రం తెలియదు. కానీ.. చుట్టూ తెలుగువాళ్లే. అందరూ గలగలా మాట్లాడేస్తుంటే తెల్లమొహం వేసుకొని కూర్చునేదాన్ని. 

Pavitra Jayaram

ఓ టైమ్ లో సీరియల్స్‌ వద్దు.. ఏం వద్దు పారిపోదాం అనుకున్నా. కానీ.. తోటి ఆర్టిస్టులు నా పరిస్థితి అర్థం చేసుకొన్నారు. ధైర్యం చెప్పారు. తెలుగు రాయడం, చదవడం, మాట్లాడటం నేర్పారు. ప్రస్తుతం ‘త్రినయని’ సీరియల్‌లో విలన్‌ పాత్రలో మీరంతా నన్ను చూస్తూనే ఉన్నారు. అంతకంటే ముందు ‘కోడళ్లూ మీకు జోహార్‌’, ‘స్వర్ణప్యాలెస్‌’ సీరియల్స్‌లో చేశాను. నా కష్టమే నన్ను నిలబెట్టింది.

Pavitra Jayaram


 కన్నడ కంటే తెలుగులో నాకు ఎక్కువ ఆదరణ లభించింది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది కూడా తెలుగులోనే. ఈ త్రినయని సీరియల్.. కన్నడలో కూడా డబ్బింగ్ అవుతుంది. దాంతో కన్నడలో ఫాలోయింగ్ పెరిగింది. అంతకు ముందు చాలా కన్నడ సీరియల్స్‌లో చేశాను కానీ.. ఈ సీరియల్‌కి వచ్చిన పేరు అయితే రాలేదు. నా పేరుతో చాలా ఫ్యాన్ పేజ్‌లు కూడా వచ్చేశాయి.

Pavitra Jayaram


అలాగే కమిట్మెంట్ లాంటివి ఉండడం వల్లే అవకాశాలు వస్తాయి అనే దాంట్లో కొంత నిజం ఉంది అయితే పూర్తిగా కాదు. సరిగ్గా చెప్పలేకపోతున్నాను గాని కొత్తల్లో కొన్ని  ఫేస్ చేశాను. అలాగే ఇండస్ట్రీ లో ఉన్నాము అంటే మన వెనక అదే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎంత కష్టపడుతున్నాం, మనమేం చేస్తున్నాం అనేది ఎవరికీ కనిపించదు. మాది కలర్ ఫుల్ లైఫ్ కా కనిపిస్తుంది  కాబట్టి వీళ్ళు ఏదో చేసి సంపాదిస్తున్నారు అని అంటారు. అలా సంపాదించిన వారు కూడా ఉన్నారు అనేది కాదనలేని నిజం అని చెప్పుకొచ్చారు  పవిత్ర.

Pavitra Jayaram


కమిట్మెంట్, క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కడైనా ఉంది, కాకపోతే ఇండస్ట్రీలో మాత్రమే అది కనిపిస్తోందని, వేరే చోట్లలో కనిపించట్లేదని చెప్పుకొచ్చారు పవిత్ర. కన్నడలో నే ను వన్ డే ఆర్టిస్ట్ గా చేసాను. వన్డే ఆర్టిస్టులకు సాలరీ ఏమీ ఇవ్వరు, కేవలం ఫుడ్ పెట్టి పంపిస్తారు. ఆ తరువాత నెమ్మదిగా పవిత్ర జయరాం బాగా నటిస్తారనే పేరు రావడంతో రోజుకు రెండు మూడు సీరియల్స్ చేసేదాన్ని అని, అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా తనకు ఎక్కడా ఒక్కసారి కూడా అలాంటి పరిస్థితి రాలేదని చెప్పారు పవిత్ర జయరాం.

Pavitra Jayaram

  అలాగే ఎవరైనా తెలిసిన అమ్మాయి ఇండస్ట్రీలోకి వస్తాను అంటే వద్దని చెప్తానని కామెంట్ చేశారు పవిత్ర. ఇక్కడ ఒకవేళ ఏం జరిగినా ఫేస్ చేసే ధైర్యం ఉంటేనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని, లేదంటే ఇండస్ట్రీకి దూరంగా వేరే పని చేసుకుని బ్రతకాలని ఈ సందర్భంగా సలహా ఇచ్చారు. తాను ధైర్యంగా ఫేస్ చేశాను కాబట్టే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అన్నారామె.

Pavitra Jayaram


ఇక సినిమాల్లోనూ తెలుగులో ఒక సినిమా కూడా చేశాను (బుచ్చినాయుడు కండ్రిగ). కరోనా సమయంలో ఓటీటీలో రిలీజ్‌ అయింది. ఎంత బిజీగా ఉన్నా.. రోజూ జిమ్‌కు వెళ్తాను. గ్లామర్‌ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అందంతోపాటు ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలి. ఫుడ్‌ విషయంలో పెద్దగా రూల్స్‌ ఏం లేవు. మధ్యాహ్న భోజనం మాత్రం కడుపు నిండా తింటాను. 

Pavitra Jayaram

ఫ్యామిలీ విషయానికొస్తే..మ్యారేజ్ నాకు ఎప్పుడో అయిపోయింది. నాకు పెళ్లి అయ్యినరోజు కూడా గుర్తులేదంటే.. మీరు అర్ధం చేసుకోవచ్చు. నాకు పెళ్లి కావడం కాదు.. పాపా బాబూ కూడా ఉన్నారు. బాబుకి 22 ఏళ్లు.. పాపకి 19 ఏళ్లు. పెళ్లి ఎప్పుడో అయ్యింది.. ఎప్పుడో పోయింది.. హ్యాపీగా ఉన్నా అని చెప్పుకొచ్చింది. 
 

Pavitra Jayaram


నేను పదో తరగతి పూర్తి చేయగానే.. 16 ఏళ్లకే పెళ్లి చేసేశారు. చదువు అక్కడే ఆగిపోయింది. మ్యారేజ్ లైఫ్ ఎండ్ అయిపోయింది. చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నా కూతురు కొడుకుని తీసుకుని బెంగుళూరు వచ్చేశాను. పిల్లల్ని పెంచడం కోసం చాలా పనులు చేశాను. హౌస్ కీపింగ్ చేశాను.. నర్సింగ్ కాలేజ్‌లో లైబ్రరీలో చేశాను.. కానీ ఎక్కడికి వెళ్లినా కూడా.. ఒంటరి ఆడది అనేసరికి చిన్న చూపు ఉండేది.

Pavitra Jayaram


ఆమెకు ఓ కూతురు కొడుకు ఉన్నారు.  మెల్లమెల్లగా సీరియల్స్‌లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వెళ్లింది. తెలుగులో మొదటిగా ‘నిన్నేపెళ్లాడతా’ సీరియల్స్‌లో అవకాశం అందుకుంది పవిత్రా జయరామ్. త్రినయని సీరియల్‌తో పేరు సంపాదించుకుంది పవిత్రా జయరామ్ తన భర్తతో విభేదాల గురించి.. తన పిల్లల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్ పైనే ఉందన్నారు. 

click me!