మహేష్ బాబు కొడుకు ప్లేస్ లో నేను ఉండాల్సింది.. బాహుబలి చైల్డ్ ఆర్టిస్ట్ షాకింగ్ కామెంట్స్

First Published | Apr 22, 2024, 10:28 AM IST

చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాలు అందుకోవడం అదృష్టమే అని చెప్పాలి. ఇప్పుడు పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, అంతకు ముందు లవర్ బాయ్ గా రాణించిన తరుణ్ లాంటి వారంతా చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి హీరోలు అయినవాళ్లే.

చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాలు అందుకోవడం అదృష్టమే అని చెప్పాలి. ఇప్పుడు పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, అంతకు ముందు లవర్ బాయ్ గా రాణించిన తరుణ్ లాంటి వారంతా చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి హీరోలు అయినవాళ్లే. టాలీవడ్ లో ఎక్కువగా అవకాశాలు అందుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ లలో నిఖిల్ దేవదుల ఒకరు. 

నిఖిల్ దేవదుల కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, ఉయ్యాలా జంపాల, రన్ రాజా రన్, సీతా రామం ఇలా చాలా చిత్రాల్లో నిఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. దాదాపు 70 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నిఖిల్ కనిపించాడట. అయితే నిఖిల్ కి గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం బాహుబలి. బాహుబలి చిత్రంలో నిఖిల్ చిన్ననాటి అమరేంద్ర బాహుబలిగా నటించాడు. 


నిఖిల్ కి ఈ చిత్రంలో చాలా సీన్స్ ఉన్నాయి. నిఖిల్ బాహుబలి రెండు భాగాల కోసం 7 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడట. కట్టప్పతో తినిపించు మామ సన్నివేశం, తేలు కుట్టే సన్నివేశం ఇలా ప్రతిదీ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అని నిఖిల్ తెలిపాడు. బాహుబలి తర్వాత తనకి తమిళంలో కూడా అవకాశాలు వచ్చినట్లు నిఖిల్ తెలిపారు. 

కొన్ని చేదు అనుభవాలు కూడా ఉన్నాయట. మహేష్ బాబు చిత్రంలో నటించే ఛాన్స్ చేతుల్లోకి వచ్చి చేజారిందని నిఖిల్ తెలిపాడు. 1 నేనొక్కడినే చిత్రం కోసం నన్ను వారం పాటు ఆడిషన్స్ చేశారు. నన్ను ఫిక్స్ చేశారు. షూటింగ్ డేట్స్ కూడా ఫైనల్ అయ్యాయి. కాస్ట్యూమ్స్ కోసం నా కొలతలు కూడా తీసుకున్నారు. మహేష్ బాబు చిన్ననాటి రోల్ అని చాలా ఎగ్జైట్ గా ఉన్నా. 

షూటింగ్ కి ముందు రోజు కాల్ రాలేదు. పోస్ట్ పోన్ అయిందేమో అని ఎదురుచూస్తున్నా. కొన్ని రోజుల తర్వాత పోస్టర్ లో మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కనిపించాడు. అప్పుడు అర్థం అయింది.. ఈ ఆఫర్ పోయింది అని అంటూ నిఖిల్ నిరాశ వ్యక్తం చేశాడు. 

అంతకు ముందు మహేష్ బాబు మరో చిత్రానికి కూడా అలాగే జరిగిందని నిఖిల్ తెలిపాడు. బాహుబలి తర్వాత ఓ స్టార్ హీరో తమిళ చిత్రంలో ఆఫర్ వచ్చింది. ఆ మూవీ కోసం బాహుబలి లో లాగే లాంగ్ హెయిర్ ఉండే లుక్ కావాలన్నారు. అదే సమయంలో మరో చిత్రం కోసం నేను గుండు గీయించుకుని ఉన్నా. దాని వల్ల ఆ అఫర్ కూడా పోయిందని నిఖిల్ తెలిపాడు. 

Latest Videos

click me!