సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాతో స్టార్‌ అయిపోయిన రష్మిక మందన్నా.. జాక్‌ పాట్‌ అంటే ఇదే మరీ..

Published : Apr 22, 2024, 10:49 AM ISTUpdated : Apr 22, 2024, 04:02 PM IST

రష్మిక మందన్నా ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. కానీ సాయిపల్లవి కారణంగానే ఈ స్థాయికి అందుకుందట. మరి ఆ కథేంటో చూస్తే.    

PREV
18
సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాతో స్టార్‌ అయిపోయిన రష్మిక మందన్నా.. జాక్‌ పాట్‌ అంటే ఇదే మరీ..

సినిమాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఓవర్‌ నైట్‌లో స్టార్‌ కావచ్చు, అంతే వేగంగా పడిపోవడం కూడా జరుగుతుంది. రాత్రికి రాత్రి కాంబినేషన్లు మారిపోతుంటాయి. మేకర్స్ నిర్ణయం హీరోహీరోయిన్ల తలరాతలు మారిపోతుంటాయి. అదే సమయంలో కొత్త వారికి స్టార్స్ ఇచ్చే అవకాశాలు వారికి లైఫ్‌ ఇచ్చిన వాళ్లు అవుతారు. ఒక్క సినిమాతో నిర్మాత పెద్ద హిట్‌ కొట్టి లాభాలు గడించవచ్చు, లేదంటే ఒకే సినిమాతో అడ్రస్‌ లేకుండా వెళ్లిపోవడం జరగవచ్చు. చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏమైనా జరుగుతుంది. 
 

28

చాలా వరకు ముందు ఓ హీరోయిన్‌ని అనుకుంటారు. ఆ తర్వాత రాత్రికి రాత్రి హీరోయిన్‌ని మార్చేస్తారు. షూటింగ్‌ మధ్యలోనే హీరోయిన్‌ మారిపోయే సందర్భాలుంటాయి. అలాంటి అవకాశాలను పొందిన వాళ్లు స్టార్లు అయిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ జాబితాలో రష్మిక మందన్నా ఉండటం విశేషం. సాయిపల్లవి రిజెక్ట్ చేసిన సినిమాతో ఆమె స్టార్‌ అయిపోయింది. ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తుంది. 

38

మరి ఆ కథేంటో చూస్తే.. కన్నడకి చెందిన రష్మిక మందన్నా.. మొదట కన్నడ చిత్రంతోనే కెరీర్‌ని ప్రారంభించింది. కిర్రిక్‌ పార్టీలో ఆమె రక్షిత్‌ శెట్టి సరసన హీరోయిన్‌గా నటించింది. రిషబ్‌ శెట్టి దీనికి దర్శకుడు. ఈ మూవీ పెద్ద హిట్ కావడంతో రష్మిక మందన్నా ఓవర్‌ నైట్‌లో అక్కడ స్టార్‌ అయిపోయింది. ఆ సినిమా పేరు బాగా వినిపించిన నేపథ్యంలో తెలుగు మేకర్స్ దృష్టి ఆమెపై పడింది. 
 

48

కన్నడలో రెండో సినిమాకే తెలుగులో ఆఫర్లు దక్కించుకుంది రష్మిక మందన్నా. టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తూ నాగ శౌర్యతో `ఛలో` చిత్రంలో నటించింది. ఇక్కడ కూడా పెద్ద హిట్‌ పడింది. అంతే రష్మిక పేరు తెలుగులోనూ బాగా వినిపించింది. రెండో మూవీ విజయ్‌ దేవరకొండతో `గీత గోవిందం`లో నటించింది. ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ కావడంతో ఇక్కడ స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది రష్మిక. మోస్ట్ ప్రామిసింగ్‌ హీరోయిన్‌గా మారింది. 

58

తెలుగులో బ్యాక్‌ టూ బ్యాక్‌ భారీ హిట్స్ పడ్డాయి. `దేవదాస్‌`,  `డియర్‌ కామ్రేడ్‌`, `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాల్లో నటించింది. `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాలు మంచి విజయాలను అందించాయి. ఈ క్రమంలో రష్మికకి `పుష్ప` సినిమా పడింది. ఈ చిత్రం ఇండియా వైడ్‌గా బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీతో రష్మిక పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయింది. హిందీ ఆఫర్లని అందుకుంది. గతేడాది `యానిమల్‌`తో మరో సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు `పుష్ప2` కోసం వెయిట్‌ చేస్తుంది. 
 

68

ఇదిలా ఉంటే రష్మిక ఫస్ట్ మూవీ `కిర్రిక్‌ పార్టీ`లో ఫస్ట్ అనుకున్న హీరోయిన్‌ రష్మిక కాదు. మొదటగా సాయిపల్లవిని అనుకున్నారు. హీరోయిన్‌గా ఆమెని ఎంపిక చేశారు. కానీ అనూహ్యంగా సాయిపల్లవి ఈ మూవీని రిజెక్ట్ చేసింది. దీంతో ఆ తర్వాత రష్మిక వద్దకు ఈ ఆఫర్‌ వచ్చింది. స్టార్‌ అయిపోయింది. అదే సాయిపల్లవి ఈ మూవీ చేసి ఉంటే రష్మిక కి అలా తెరంగేట్రం జరిగేదా? సక్సెస్‌ వచ్చేదా? తెలుగులోకి వచ్చేదా? అనేది పెద్ద మిస్టరీగా ఉండేది. 
 

78

మలయాళ మూవీ `ప్రేమమ్‌` చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ని ప్రారంభించిన సాయిపల్లవి.. `ఫిదా` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తోంది. సాయిపల్లవి పాన్‌ ఇండియా సినిమాలు చేయలేదుగానీ, ఆమెకి ఆ రేంజ్‌ ఇమేజ్‌ ఉంది. లేడీ పవర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

88

ఇప్పుడు హిందీలో `రామాయణ్‌`లో భాగం కాబోతుంది. ఈ మూవీ వర్కౌట్‌ అయి హిట్‌ అయితే గ్లోబల్‌ స్టార్‌ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో ఆమె `తండేల్‌`లో నటిస్తుంది. తమిళంలో ఓ మూవీ, హిందీలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది సాయిపల్లవి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories