Toxic: టాక్సిక్ ట్రైలర్ రివ్యూ.. వామ్మో ఇలా ఉందేంటి, యష్ మ్యాడ్నెస్ పీక్స్ అంతే.. పిల్లలు అస్సలు చూడకూడదు

Published : Aug 08, 2026, 09:13 PM IST

కేజీఎఫ్ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్‌లో పవర్, ప్రేమ, ద్రోహం, తండ్రీకొడుకుల పోరు కనిపిస్తోంది.

PREV
15
Toxic Trailer Review

శాండల్‌వుడ్ నుంచి వస్తున్న భారీ చిత్రాల్లో టాక్సిక్ ఒకటి. కేజీఎఫ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పలుమార్లు వాయిదా పడిన అనంతరం ఈ చిత్రం ఆగస్టు 26న థియేటర్లలోకి రానుంది. యశ్ కథను రాయడంతో పాటు సినిమాలో నటించగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా బెంగళూరులో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో చిత్రబృందం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతోందనే దానిపై ఆసక్తిని మరింత పెంచింది.

25
మైండ్ బ్లాక్ చేసే విజువల్స్

ట్రైలర్‌లో ప్రధానంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు దాని నిడివి, ప్రజెంటేషన్ విధానం. సాధారణంగా సినిమాల థియేట్రికల్ ట్రైలర్లు రెండు నుంచి మూడు నిమిషాల మధ్య ఉంటాయి. అయితే టాక్సిక్ ట్రైలర్ నాలుగు నిమిషాలకు పైగా ఉంది. అంతేకాకుండా సాధారణ కమర్షియల్ సినిమాల ప్రమోషనల్ కంటెంట్‌లో కనిపించే మూస పద్ధతులకు భిన్నంగా దీనిని రూపొందించారు. సినిమా కథ, పాత్రలు, వాతావరణాన్ని అర్థం చేసుకునేలా ట్రైలర్‌లోని విజువల్స్‌ను ప్రత్యేకమైన శైలిలో చూపించారు. సినిమా ఏ స్థాయిలో విభిన్నంగా ఉండబోతోందనే విషయాన్ని ట్రైలర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

35
కథ ఇదే

టాక్సిక్ కథలో అధికారం కోసం జరిగే పోరాటం, ప్రేమ, ద్రోహం, యుద్ధంలో శాంతి, ధైర్యం వంటి పలు అంశాలను ప్రస్తావించారు. అయితే వీటన్నింటి మధ్య తండ్రీకొడుకుల మధ్య ఉండే పోటీ, సంఘర్షణ కథలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది. యశ్, చిత్రబృందం కథలోని పలు లేయర్స్ ని ట్రైలర్‌లో చూపించారు. పాత్రల స్వభావాలు, వారి మధ్య ఉండే సంబంధాలను పూర్తిగా వెల్లడించకుండా ప్రేక్షకులకు రాబోయే కథపై ఒక అంచనాను కలిగించేలా ట్రైలర్‌ను రూపొందించారు. దీంతో సినిమా సాధారణ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలకు భిన్నంగా ఉండబోతోందనే విషయం స్పష్టమవుతోంది.

45
తండ్రీకొడుకుల వార్, అలా కూడా నటించిన యష్

ట్రైలర్ లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఇందులో యష్ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారు. రెండు పాత్రల మధ్య యష్ చూపించిన వ్యత్యాసం అద్భుతం అనే చెప్పాలి. ట్రైలర్‌లో ఒక సన్నివేశంలో యశ్ నగ్నంగా కూడా కనిపిస్తారు. సినిమాకు సంబంధించిన ఏ ఫెయిరీ టేల్ ఫర్ ది గ్రోన్‌అప్స్ అనే ట్యాగ్‌లైన్‌కు ఈ సన్నివేశం అనుగుణంగా ఉండేలా చూపించారు. ఇక యాక్షన్ సన్నివేశాలు భారీ స్థాయిలో తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. యాక్షన్ కొరియోగ్రఫీ, విజువల్స్, సినిమా స్థాయి ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా యశ్ పాత్రను పూర్తిగా విభిన్నమైన శైలిలో చూపించేందుకు దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ప్రయత్నించినట్లు ట్రైలర్‌లోని సన్నివేశాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు భిన్నంగా ఈ ట్రైలర్ ఉండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. కొన్ని వన్ లైన్ డైలాగులు చాలా పవర్ ఫుల్ గా, బోల్డ్ గా ఉన్నాయి. ఈ మూవీలో యష్ పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉండబోతోంది అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. మొత్తంగా టాక్సిక్ చిత్రం అడల్ట్స్ కి మాత్రమే. పిల్లలని దూరంగా ఉంచాలి.

55
అంచనాలు పెంచేసిన ట్రైలర్

టాక్సిక్ చిత్రాన్ని కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. అనంతరం హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లోకి డబ్ చేయనున్నారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. యశ్, గీతూ మోహన్‌దాస్ కలయికలో వస్తున్న ఈ చిత్రం ఎంత భిన్నంగా ఉండబోతోందో ట్రైలర్ ద్వారా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఇక ఆగస్టు 26న సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ విభిన్నమైన, ఎలాంటి హద్దులు లేని కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories