టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇష్టపడనివారు అంటూ ఎవరూ ఉండరు. టాలీవుడ్ తో పాటు మలయాళ సినీ పరిశ్రమలో కూడా బన్నీకి భయంకరమైన ఫాలోయింగ్ ఉంది. ఆర్య సినిమా నుంచి ఆయనకు మలయాళంలో పిచ్చి ప్యాన్స్ ఉన్నారు. యూత్ ఆయన స్టైల్స్ ను కూడా ఫాలో అవుతుంటారు.,
మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ , రజినీకాంత్ తరువాత కటౌట్లు పెట్టేంత పెద్ద హీరో బన్నీ మాత్రమే. అంత అభిమానిస్తారు మలయాళ ప్రేక్షకులు అల్లు అర్జున్ ను. అంతే కాదు అల్లు అర్జున్ ను ముద్దుగా మల్లు అర్జున్ అని కూడా పిలుచుకుంటారు ఫ్యాన్స్.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక టాలీవుడ్ తో పాటు మాలీవుడ్ లో స్టార్ డమ్ ఉన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు. ఈరెండు భాషలే కాకుండా.. బాలీవుడ్ లో కూడా స్టార్ డమ్ ను సంపాధించాడు అల్లు అర్జున్. అంతే కాదు. పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ ను కూడా ఖాతాలో వేసుకున్నాడు.
టాలీవుడ్ నుంచి ఇన్నేళ్ళుగా బెస్ట్ హీరో క్యాటగిరీలో నేషనల్ అవార్డ్ వచ్చింది లేదు. కాని ఆ రికార్డ్ ను అల్లు అర్జున్ సాధించాడు. టాలీవుడ్ కు కీర్తి కిరీటం లా మారాడు. అటు మాలీవుడ్ ఆడియన్స్ కూడా బన్నీకి అవార్డ్ రావడంతో పొంగిపోయారు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన రామ్ చరణ్ సినిమా ఏదో తెలుసా..? టైటిల్ ఇదే..?
ఇక విషయం ఏంటంటే.. మలయాళంలో సామాన్య ఫ్యాన్స్ ఎలా ఉన్నారో.. చిన్న స్టార్స్ కూడా అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ అలానే ఉన్నారు. బన్ని నటన అంతే ఇష్టమనే మలయాళ యంగ్ హీరోలు ఎందరో. వారిలో టొవినో థామస్ కూడా ఒకరు. ఈ యంగ్ హీరో సినిమాలు మలయాళంలో అద్భుతంగా ఆడతాయి. తెలుగులో కూడా మనోడి మంచి ఫాలోయింగ్ ఉంది.
ఓటీటీలో తెలుగు డబ్బింగ్ మలయాళ సినిమాల ద్వారా టొవినో థామస్ ఫేమస్ అయ్యాడు. ఇక ఈ హీరో అల్లు అర్జున్ పై, మన తెలుగు హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. టొవినో థామస్ తన 50వ సినిమా ARM తో సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు.
టొవినో థామస్ మూవీ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. అంతే కాదు పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈమూవీ ప్రమోషన్స్ తెలుగులో కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ఇక్కడ తెలుగులో కూడా చేసారు. తాజాగా ARM సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. అ ఈవెంట్ కోసం టొవినో థామస్ హైదరాబాద్ వచ్చారు.
ఈ వేడుకల్లో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేను ఫస్ట్ చూసిన తెలుగు సినిమా చిరంజీవి సర్ జగదేకవీరుడు అతిలోక సుందరి. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఆ సినిమా చూసాను. ఆ తర్వాత నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ సర్ ఆర్య సినిమా రిలీజయింది. ఆ సినిమా చూసాను. అప్పుడే కేరళలో అల్లు అర్జున్ సర్ స్టార్. ఆ తర్వాత అయన సినిమాలన్నీ అక్కడ రిలీజ్ అయ్యాయి, అన్ని చూసాను అని తెలిపారు.
ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. బాహుబలి సినిమా అయన తప్ప ఎవరూ చేయలేరు. ఆయన్ని అభిమానించని వారు ఎవరుంటారు అని అన్నారు. అలాగే RRR సినిమా ప్రచారంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కేరళ వచ్చినప్పుడు వాళ్ళని కలిసి మాట్లాడాను. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ చాలా బాగా మాట్లాడతారు అని అన్నారు. దీంతో టొవినో థామస్ మన తెలుగు హీరోలపై మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.