స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. కాజల్ అగర్వాల్ 2020లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక కొడుకు సంతానం. బిడ్డకి జన్మనివ్వడం కోసం కాజల్ సినిమాల నుంచి షార్ట్ టైం గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ బిజీ అయింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ కి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు.