మీకు ఇష్టమైన చాలా మంది బాలీవుడ్ తారలు పాకిస్తాన్ కు చెందినవారు అని మీకు తెలుసా..? అక్కడ పుట్టి ఇండియాలో స్టార్లుగామారారని తెలుసా. షారుఖ్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులు ఎలా ప్రస్తుతం పాకిస్తాన్‌లో భాగంగా ఉన్నఏ ప్రాంతాలకు చెందినవారంటే..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రణ్‌బీర్ కపూర్
రణ్‌బీర్ కపూర్ కుటుంబం పాకిస్తాన్‌కు చెందినది. అతని తాత పృథ్వీరాజ్ కపూర్ ల్యాల్‌పూర్‌లో, తండ్రి రాజ్ కపూర్ పెషావర్‌లో జన్మించారు. సరిహద్దును దాటి కపూర్ ఫ్యామిలీ అనుబంధం, వారి వారసత్వం విస్తరించి ఉంది. ఇక బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ హవా అందరికి తెలిసిందే.
అమితాబ్ బచ్చన్
ఇక బాలీవుడ్ రారాజు అమితాబ్ బచ్చన్ కూడా పాకిస్తాన్ మూలాలు ఉన్నవారే. ఆయన తల్లి తేజీ బచ్చన్ బ్రిటిష్ ఇండియాలోని ల్యాల్‌పూర్‌లో (ప్రస్తుతం పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్) జన్మించారు. విభజనకు ముందు భారతదేశంతో అమితాబ్ కుటుంబ సంబంధాలను కాపాడుకోవడం కోసం వారు విభజన తరువాత ఇండియాకు తరలి వచ్చారు.
అమ్రిష్ పురి
1932లో లాహోర్‌లో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో) జన్మించిన ప్రముఖ నటుడు అమ్రిష్ పురి తర్వాత సిమ్లాకు వలస వెళ్లారు. లాహోర్‌లోని ఆయన ప్రారంభ జీవితం, తర్వాత భారతీయ సినిమాలో ఆయన వేసిన ముద్ర అంతా ఇంతా కాదు. తెలుగు ప్రేక్షకులు కూడా అమితాబ్ ను మర్చిపోలేరు.