రాజమౌళినే ఫిదా చేసిన సంచలన చిత్రం ఓటీటీలోకి రాబోతోంది.. గెట్ రెడీ

Published : May 21, 2025, 05:16 PM IST

అభిషన్ జీవింద్ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రాన్, కమలేష్ నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా త్వరలోనే OTTలో విడుదల కానుంది.దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
14
Tourist Family OTT Release

2025 సంవత్సరం తమిళ సినిమాకి వచ్చిన మాస్టర్ పీస్ టూరిస్ట్ ఫ్యామిలీ. 25 ఏళ్ల అభిషన్ జీవింద్ దర్శకత్వం వహించారు. శశికుమార్, సిమ్రాన్, ఎం.ఎస్.భాస్కర్, రమేష్ తిలక్, కమలేష్ లాంటి స్టార్స్ నటించారు. షాన్ రోల్డాన్ సంగీతం అందించారు. మిలియన్ డాలర్ స్టూడియోస్ బ్యానర్‌పై యువరాజ్ నిర్మించారు.

24
రెట్రోకి పోటీగా వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ

టూరిస్ట్ ఫ్యామిలీ మే 1న విడుదలైంది. సూర్య రెట్రో సినిమాకి పోటీగా విడుదలై, మొదట్లో తక్కువ థియేటర్స్ ఉన్నా, ఆ తర్వాత పెరిగాయి. 3 వారాలు దాటినా సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో ఉంది. 

34
టూరిస్ట్ ఫ్యామిలీ వసూళ్లు

16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన టూరిస్ట్ ఫ్యామిలీ ఖర్చుకు మించి లాభాలు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 75 కోట్లు వసూలు చేసింది. శశికుమార్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. రజనీకాంత్, రాజమౌళి ప్రశంసలు అందుకుంది. రాజమౌళి అయితే ఒక అద్భుతమైన చిత్రాన్ని చూశాను అంటూ ప్రశంసలు కురిపించారు.

44
టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ రిలీజ్

థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీలోకి రాబోతోంది. జియో హాట్ స్టార్ ఓటీటీ హక్కులు కొనుగోలు చేసింది. మే 31న ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇది ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇటీవల ఓటీటీలో తమిళ, మలయాళీ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది.  

Read more Photos on
click me!

Recommended Stories