ఏప్రిల్‌ 2025 అత్యధిక వసూళ్లని రాబట్టిన టాప్‌ 10 ఇండియన్‌ సినిమాలు.. తెలుగు సినిమాలు ఎన్ని?

Published : May 21, 2025, 04:26 PM IST

ఇండియా వైడ్‌గా వివిధ భాషల్లో విడుదలైన సినిమాలన్నీ కలిపి ఏకంగా రూ. 825 కోట్లు వసూలు చేశాయి. ఇందులో 4 సినిమాలు ₹100 కోట్లకు పైగా వసూలు చేశాయి.

PREV
15
ఏప్రిల్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాలు

ఈ ఏడాది ఇండియన్‌ సినిమా కాస్త ఆశాజనకంగా కనిపిస్తుంది. అయితే బాలీవుడ్‌ మాత్రం ఇంకా స్ట్రగుల్‌ అవుతూనే ఉంది. సౌత్‌ మూవీస్‌ మాత్రం మంచి వసూళ్లతో దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా చిన్న చిత్రాలు పెద్ద విజయాలు సాధిస్తూ అందరిని అకట్టుకుంటున్నాయి. ఏప్రిల్‌ నెలలో తమిళం, మలయాళం, హిందీ చిత్రాలు రచ్చ చేశాయి. కానీ తెలుగు సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. 

25
ఓర్మాక్స్ మీడియా టాప్‌ 10 సినిమాల జాబితా

తాజాగా ఏప్రిల్‌ నెలకు సంబంధించి ఓర్మాక్స్ మీడియాలో టాప్‌ 10 హైయ్యెస్ట్ గ్రాస్డ్ మూవీస్‌ లిస్ట్ విడుదల చేసింది. అందులో `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ`, `తుడరుమ్‌` వంటి చిత్రాలు ముందు వరుసలో ఉన్నాయి.

ఓర్మాక్స్ మీడియా రిపోర్ట్ ప్రకారం, ఏప్రిల్‌లో విడుదలైన సినిమాలు అన్నీ కలిపి ₹825 కోట్లు వసూలు చేశాయి. ఇందులో మలయాళం సినిమాలే ఏకంగా ₹225 కోట్ల కలెక్షన్లు రాబట్టడం విశేషం. 

35
ఫస్ట్ `గుడ్ బ్యాడ్ అగ్లీ`, సెకండ్‌ `తుడరుమ్‌`

అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ నెలలో ఇండియన్ బాక్సాఫీస్ లో టాప్ లో ఉంది. ఓర్మాక్స్ ప్రకారం, ఈ సినిమా ₹183 కోట్లు వసూలు చేసింది. రెండో స్థానంలో మోహన్ లాల్ 'తుడరుమ్‌' ఉంది. ఈ సినిమా ₹148 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ సినిమా 'కేసరి చాప్టర్ 2' మూడో స్థానంలో ఉంది. దీని వసూళ్లు ₹107 కోట్లు.

45
ఏప్రిల్‌లో నాలుగు 100 కోట్ల సినిమాలు

నాలుగో స్థానంలో సన్నీ డియోల్‌ `జాట్‌` ఉంది. ఇది  ₹103 కోట్లు రాబట్టింది. ఇలా ఏప్రిల్‌లో 4 సినిమాలు 100 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.  ఇక టాప్ 10 లిస్ట్ లో ఇంకా మూడు మలయాళం సినిమాలు ఉన్నాయి. ఐదో స్థానంలో 'ఆలప్పుజ జింఖానా` (₹50 కోట్లు), ఏడో స్థానంలో 'మరణమాస్' (₹22 కోట్లు), పదో స్థానంలో 'బసూక' (₹14 కోట్లు) చిత్రాలు నిలిచాయి. 

55
తొమ్మిదో స్థానంలో తెలుగు సినిమా `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి`

ఇవి కాకుండా ఇతర సినిమాల విషయానికి వస్తే ఆరో స్థానంలో హాలీవుడ్ సినిమా 'ఎ మైన్ క్రాఫ్ట్ మూవీ' ఉంది. దీని వసూళ్లు ₹22 కోట్లు. ఎనిమిదో స్థానంలో ఇంకో హాలీవుడ్ సినిమా 'సిన్నర్స్' (₹16 కోట్లు) ఉంది. తొమ్మిదో స్థానం తెలుగు సినిమా దక్కించుకుంది. కళ్యాణ్ రామ్, విజయశాంతి కలిసి నటించిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'  రూ.15కోట్లతో చివరి నుంచి రెండో స్థానంలో నిలవడం గమనార్హం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories