Jabardasth show: ఆట ముగిసినట్లేనా?... జబర్దస్త్ షో ఈ దారుణ పరిస్థితికి కారణాలు ఇవే?

First Published Jun 30, 2022, 10:24 AM IST

మొన్న రోజా నిన్న సుధీర్ నేడు అనసూయ... వరుసగా జబర్దస్త్ ని వీడిన స్టార్స్. జబర్దస్త్ కి ఆకర్షణగా ఉన్న ఒక్కొక్కరు నిష్క్రమిస్తుండగా షో దిగజారిపోతుంది. జబర్దస్త్ (Jabardasth)తో పాటు ఈటీవి పరిస్థితి దారుణంగా మారింది. 
 

Jabardasth comedy show


షోకి ఎంత బ్రాండ్ నేమ్ ఉన్నప్పటికీ స్టార్స్ ప్రెజెన్స్ చాలా అవసరం. ధనాధన్ ధన్ రాజ్, టిల్లు వేణు, రోలర్ రఘు వంటి టీం లీడర్స్ షో నుండి తప్పుకున్నాక రెండు టీమ్స్ జబర్దస్త్ కి మంచి టీఆర్పీ తెచ్చిపెట్టాయి. వాటిలో ఒకటి సుడిగాలి సుధీర్ టీమ్ కాగా, హైపర్ ఆది టీమ్ మరొకటి. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలను ఈ రెండు టీమ్స్ ముందుండి నడిపించాయి. 

చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ టీమ్స్ వాటికి కొంచెం సపోర్ట్ గా నిలిచేవి. ఇప్పుడు ఆ రెండు టీమ్స్ విచ్ఛిన్నం అయ్యాయి. సుడిగాలి సుధీర్ టీం నుండి సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోయారు. మిగిలింది రామ్ ప్రసాద్ మాత్రమే. వారిద్దరూ వెళ్లిపోవడంతో సరైన కాంబినేషన్ లేక ఆయన కూడా కామెడీ పంచలేకున్నాడు. ఇక హైపర్ ఆది లేని టీంని ఊహించడం కూడా కష్టమే.


కమెడియన్స్ పంచ్ లకు టైమింగ్ కౌంటర్స్ తో నవ్వించే రోజా (Roja)మంత్రి పదవి రావడంతో శెలవన్నారు. తాజాగా గ్లామర్ క్వీన్ అనసూయ కూడా వెళ్ళిపోతున్నట్లు వెల్లడించారు. హాట్ హాట్ డ్రెస్ లలో సూపర్ సెక్సీ ఫోజులతో అనసూయ (Anasuya)ఒక వర్గాన్ని ఆకర్షిస్తారు. అనసూయ వెళ్లిపోవడంతో ఆమె ఫ్యాన్స్, గ్లామర్ ఆరాధకులకు షోపై ఆసక్తిపోనుంది. 

ఇక జబర్దస్త్ లో మిగిలింది కేవలం రష్మీ (Rashmi Gautam)మాత్రమే. ఆ షోకి మిగిలిన ఏకంగా జెమ్, ఆకర్షణ. రోజా, అనసూయ, సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది లేకుండా ఆమె ఉన్నా ప్రయోజనం ఏమీ లేదు. మొత్తంగా దాదాపు దశాబ్దంగా పాటు బుల్లితెరను ఏలిన ఓ లెజెండరీ షో చివరి దశకు చేరుకుంది.


జబర్దస్త్ ఈ పరిస్థితి కారణం మేకర్స్, కమెడియన్స్, డైరెక్టర్స్ మధ్య నెలకొన్న రాజకీయాలు, ఇగో వార్స్ అని తెలుస్తుంది. చాలా కాలంగా జబర్దస్త్ లో ఇవి ఉన్నాయి. ఇప్పుడు అవి తారాస్థాయి చేరాయి. అదే సమయంలో ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన వారెవరికీ ఇక జబర్దస్త్ అవసరం లేదు. అందరూ గట్టిగా నిలదొక్కున్నారు. 


అనసూయ, గెటప్ శ్రీను, సుధీర్ నటులుగా స్థిరపడ్డారు. హైపర్ ఆదికి ఇతర షోస్ లో అవకాశాలు దక్కుతున్నాయి. అదేవిధంగా ఆయన కూడా నటుడిగా సినిమాలు చేస్తున్నారు. జబర్దస్త్ సంపాదనతో పోల్చితే చాలా ఎక్కువ బయట షోస్, చిత్రాల ద్వారా వస్తుంది. ఇలా అనేక కారణాలు జబర్దస్త్ ప్రస్తుత పరిస్థితికి కారణమయ్యాయి. 

click me!