తమిళ, తెలుగు సినిమాలో 50 ఏళ్లుగా స్టార్లుగా వెలుగు వెలుగుతున్నారు. కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్. 1975లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన "అపూర్వ రాగంగళ్ సినిమాతో కమల్ హాసన్ తో కలిసి నటించి తన సినీ ప్రయాణం మొదలు పెట్టారు రజినీకాంత్.
గతంలో తెలుగు సినిమా కు గ్లామర్ ఇండస్ట్రీ అని పేరు ఉండేది. తెల్లగా ఉండేవారే ఇక్కడ హిట్ హీరోలు అవుతారనే భావన ఉండేది. కానీ దాన్ని పూర్తిగా మార్చేసి, కలరుతో సంబంధం లేదు, టాలెంట్ ఉంటే ఎవరైనా గెలవచ్చని నిరూపించారు సూపర్ స్టార్ రజినీకాంత్.
ఆ రజినీకాంతే ఎన్నో వేదికల మీద కమల్ హాసన్ ని తన గురువు అని ప్రశంసించారు. వీళ్ళ తర్వాత ఎంతో మంది హీరోలు వచ్చినా, ఇండస్ట్రీలో కింగ్స్ గా వెలుగొందుతున్నారు ఈ ఇద్దరు దిగ్గజాలు.
Also Read: పవన్ కళ్యాణ్ తో గొడవ పై బాలయ్యకు క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్