నా అనుభవాలతో నిర్ణయం మార్చుకున్నా, ఇక ఎలాంటి పాత్రలకైనా సిద్ధం.. ఆర్జీవీ హీరోయిన్ కామెంట్స్ 

First Published | Oct 11, 2024, 5:18 PM IST

రామ్ గోపాల్ వర్మ అంటే ఎక్కువగా వివాదాస్పద చిత్రాలే గుర్తుకు వస్తాయి. పాలిటిక్స్ నేపథ్యంలో వర్మ అనేక చిత్రాలు తెరకెక్కించారు. అదే విధంగా హీరోయిన్లని బోల్డ్ గా చూపిస్తూ కూడా కొన్ని చిత్రాలు చేశారు. త్వరలో ఆర్జీవీ నుంచి రాబోతున్న చిత్రం శారీ.

రామ్ గోపాల్ వర్మ అంటే ఎక్కువగా వివాదాస్పద చిత్రాలే గుర్తుకు వస్తాయి. పాలిటిక్స్ నేపథ్యంలో వర్మ అనేక చిత్రాలు తెరకెక్కించారు. అదే విధంగా హీరోయిన్లని బోల్డ్ గా చూపిస్తూ కూడా కొన్ని చిత్రాలు చేశారు. త్వరలో ఆర్జీవీ నుంచి రాబోతున్న చిత్రం శారీ. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ ఆరాధ్య దేవి ప్రధాన పాత్రలో నటిస్తోంది. 

శారీ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో ఆరాధ్య దేవి బాగా బోల్డ్ గా గ్లామర్ ప్రదర్శించినట్లు ఉంది. 23 ఏళ్ళ ఆరాధ్య దేవి అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. మలయాళీ మోడల్ అయిన ఆరాధ్యని సోషల్ మీడియాలో చూసిన ఆర్జీవీ ఫిదా అయి ఆమెకి సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుత  ఆరాధ్య దేవి గ్లామర్ ఫోటోలు, శారీ చిత్రంలో ఆమె ప్రదర్శిస్తున్న గ్లామర్ సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా ఉన్నాయి. 


ఈ విధంగా గ్లామర్ ప్రదర్శించడం పై ఆరాధ్య ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఒకప్పుడు నేను గ్లామర్ పాత్రలు చేయకూడదనుకున్నా. కానీ కాలం మారే కొద్దీ నా అభిప్రాయాలు కూడా మారిపోయాయి. నాకు ఎదురైనా అనుభవాలే నా నిర్ణయం మార్చుకునేలా చేశాయి. ఇప్పుడు గ్లామర్ పాత్రల్లో నటించడానికి కూడా రెడీ. ఎలాంటి పాత్రలకైనా నేను సిద్ధం. అవకాశం ఇస్తే  నన్ను నేను నిరూపించుకుంటా. 

గ్లామర్ వ్యక్తిగత విషయం అయినప్పటికీ సినిమాలో కూడా అది భాగం. ఇకపై గ్లామర్ పాత్రలు, వైవిధ్యమైన పాత్రలు చేస్తా. నటిగా అన్ని రకాల పాత్రలు చేయడం చాలా ముఖ్యం అని ఆరాధ్య దేవి పేర్కొంది. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న శారీ చిత్రం ఆరాధ్య దేవికి ఎలాంటి గుర్తింపు తీసుకువస్తుందో చూడాలి. 

Latest Videos

click me!