త్రిష రాజకీయాల్లోకి వస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఆమె తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసిందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు త్రిష తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
స్టార్ హీరోయిన్ త్రిష చుట్టూ ఇప్పుడు చాలా రాజకీయం నడుస్తోంది. విజయ్, త్రిష మధ్య ఎఫైర్ ఇప్పుడు ఈ చర్చలకు కారణమయ్యింది. కోలీవుడ్‌లోనే కాదు, తమిళ రాజకీయాల్లోనూ ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది ఎఫైర్ వరకు పరిమితం కావడం లేదు, రాజకీయాల్లోనూ ప్రకంపనలకు కారణమవుతోంది. త్రిష ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. తెరవెనుక విజయ్ చక్రం తిప్పుతున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీని వాడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
25
విజయ్‌తో త్రిష ఎఫైర్ రచ్చ
త్రిషతో విజయ్‌కి ఎఫైర్ ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో దళపతి విజయ్ భార్య సంగీత ఏకంగా ఆయనకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. కోర్ట్ లో డైవర్స్ కి పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో ఆమె విజయ్‌కి ఓ నటితో ఎఫైర్ ఉందని ఆరోపించిందట. ఆ నటి త్రిషనే అని అంటున్నారు. ఇప్పటికే వీరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో సంగీత ఆరోపణలకు బలం చేకూరాయి. ఆ మధ్య ఓ ఫంక్షన్‌లో విజయ్, త్రిష కలిసి కనిపించారు. దీంతో ఈ రూమర్స్ మరింత హాట్ టాపిక్‌గా మారాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు త్రిష రాజకీయాల్లోకి వస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి. ఎంజీఆర్, జయలలిత తరహాలో విజయ్, త్రిష రాజకీయాల్లోకి వస్తున్నారని, విజయ్‌కి త్రిష సపోర్ట్ గా ఉండబోతుందని సమాచారం. ఇటీవల కాలంలో ఆమె కొత్తగా ఒక్క సినిమాకి కూడా ఒప్పుకోలేదు. రాజకీయాల్లోకి రావడం కోసమే ఆమె సినిమాలు చేయడం లేదంటున్నారు. ఇదే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంజీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు జయలలిత ఆయనకు సపోర్ట్ గా ఉంది. ఆయన మరణించాక జయలలిత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లింది. సీఎం అయి తమిళ రాష్ట్రాన్ని శాసించింది. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని త్రిష ఫాలో అవుతుందని టాక్.
మరోవైపు ఇప్పుడు త్రిషకి సంబంధించిన మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఆమె కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆమె బీజేపీ నాయకులను కలిశారనే వార్త పెద్ద దుమారం రేపుతుంది. బీజేపీతో పొత్తుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇదంతా తెరవెనుక విజయ్ ఆడుతున్న గేమా? అనే టాక్ కూడా వినిపిస్తోంది. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ.. బీజేపీ, ఏఐఏడీఎంకేతో కలిసి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్టు సమాచారం. అందులో భాగంగానే త్రిష అమిత్ షాని కలిసిందంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
55
పవన్ కళ్యాణ్ తరహాలో విజయ్, త్రిష రాజకీయ ఎత్తుగడ ?
చూడబోతుంటే విజయ్ కూడా పవన్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో బీజీపీ, టీడీపీతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. విజయ్ కూడా త్రిషని వాడుకొని ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడా? అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఇందులో నిజమెంతా? త్రిష చుట్టూ జరుగుతున్న రాజకీయంలో నిజమెంతా ? త్రిష నిజంగానే రాజకీయాల్లోకి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కానీ వీరికి సంబంధించిన పరిణామాలు మాత్రం తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మున్ముందు ఏం జరగబోతుందో చూడాలి.