2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా

Published : Dec 10, 2025, 06:46 PM IST

2025 Missed Heroines: 2025 ముగియడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి.  ఈ ఏడాది చాలా మంది హీరోయిన్లు బిగ్‌ స్క్రీన్‌పై కనిపించలేదు. వీరిలో  దీపికా పదుకొనె, అలియా భట్‌ నుంచి ఐశ్వర్య రాయ్‌ వరకు ఉన్నారు.   

PREV
18
దీపికా పదుకొనె

ప్రభాస్‌తో `కల్కి 2898 ఏడీ`లో నటించిన దీపికా పదుకొణె ఈ ఏడాది మిస్‌ అయ్యింది. ఆమె నటించిన ఒక్క సినిమా కూడా 2025లో విడుదల కాలేదు. అయితే, 2026లో 'కింగ్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో `ఏఏ22`లో కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే.

28
శ్రద్ధా కపూర్‌

`సాహో`లో ప్రభాస్‌ తో రొమాన్స్ చేసిన శ్రద్ధా కపూర్ 2025లో ఏ సినిమాలోనూ కనిపించలేదు.   ఆమె 2026లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ఆమె సినిమా 'ఏథా' 2026లో విడుదల కానుంది.

38
అలియాభట్‌

`ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన అలియాభట్‌ హవా 2025 బాక్సాఫీస్ వద్ద కనిపించలేదు. ఆలియా కూడా 2026లో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఆమె సినిమా 'లవ్ అండ్ వార్'  విడుదల కాబోతుంది.

48
ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా ఇప్పుడు బాలీవుడ్ కంటే హాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. ఆమె చాలా కాలంగా ఏ హిందీ సినిమాలోనూ కనిపించలేదు. 2026లో ఆమె సినిమా ఏదీ రావడం లేదు. 2027లో తెలుగులో నటిస్తోన్న `వారణాసి` చిత్రంతో రాబోతుంది. 

58
కరీనా కపూర్‌

2025లో కరీనా కపూర్ స్క్రీన్‌పై కనిపించలేదు. కరీనా ఇప్పుడు కుటుంబంపై ఎక్కువ దృష్టి పెడుతూ, సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ సినిమా లేదు.

68
రాణీ ముఖర్జీ

రాణీ ముఖర్జీ ఇప్పుడు వెండితెరపై అరుదుగా కనిపిస్తున్నారు. ఆమె సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తారు. 2025లో ఆమె సినిమా ఏదీ రాలేదు. 2026లో 'మర్దానీ 3'తో సందడి చేయనుంది. 

78
కత్రినా కైఫ్‌

2025లో కత్రినా కైఫ్ సినిమా కూడా ఏదీ విడుదల కాలేదు. బహుశా 2026లో కూడా ఆమె సినిమా ఏదీ రాకపోవచ్చు. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ లైఫ్‌ కే పరిమితమయ్యింది.  ఇటీవలే ఆమె మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది `ఛావా`తో సంచలనం సృష్టించిన విక్కీ కౌశల్‌ భార్యనే కత్రినా. 

88
ఐశ్వర్య రాయ్‌

ఐశ్వర్య రాయ్ బచ్చన్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఈ ఏడాది కూడా నిరాశ పరిచింది.  వచ్చే ఏడాది కూడా ఆమె నుంచి సినిమాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories