Superstar Krishna తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించి మెప్పించారు. ఎంతో మంది హీరోయిన్లను స్టార్లను చేశారు. కృష్ణ జోడీగా నటిస్తే అదృష్ణ కలిసొస్తుంది అనుకునేవారు కూడా ఉన్నారు. మరి వారందిరిలో సూపర్ స్టార్ మెచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?
సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో ఏది చేసినా అది రికార్డు బ్రేక్ చేసేలా ఉండేది. 44 ఏళ్ల కెరీర్ లో దాదాపు 350 కి పైగా సినిమాల్లో నటించి కృష్ణ.. 80 మంది హీరోయిన్లతో జంటగా నటించారు. టాలీవుడ్ హీరోలలో ఎవరు సాధించలేని రికార్డు ఇది. కృష్ణతో సినిమా అంటే ఎగిరి గంతేసేవారు హీరోయిన్లు. ఆయన పక్కన నటిస్తే.. ఇండస్ట్రీలో అదృష్టం కలిసి వస్తుంది అని ఫీల్ అయ్యేవారు తారలు. అందేకే కృష్ణ సినిమా ఆఫర్ వస్తే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. ఎంతో మంది హీరోయిన్లకు ఆయనతోనటించిన తరువాతే స్టార్ డమ్ వచ్చింది. అయితే 80 మంది హీరోయిన్లలో సూపర్ స్టార్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?
25
కృష్ణతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్లు
సూపర్ స్టార్ కృష్ణ జంటగా 80 మందికి పైగా హీరోయిన్లు నటించారు. అయితే అందులో అత్యధికంగా సినిమాలు చేసిన హీరోయిన్లు ముగ్గరు ఉన్నారు. అందులో మొదటి స్థానం విజయనిర్మలదే. సినిమాలు చస్తూనే ప్రేమించి పెళ్లి చేసుకున్నా కృష్ణ, విజయ నిర్మల.. ఇండస్ట్రీలో కలిసి దాదాపు 50 కి పైగా సినిమాలు చేశారు. ఇంతక వరకూ ఇన్ని సినిమాలు చేసిన జంట మరెవరు లేరు. ఇక కృష్ణతో అత్యధిక సినిమాలు చేసిన మరో హీరోయిన్ జయప్రద. విజయ నిర్మల తరువాత స్థానంలో జయప్రద ఉంది. ఆమె కృష్ణతో కలిసి దాదాపు 45 సినిమాల వరకూ చేశారు. ఇక కృష్ణతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్లలో ముచ్చటగా మూడో స్థానంలో శ్రీదేవి ఉంది. ఆమె 31 సినిమాల్లో కృష్ణకు జంటగా నటించి మెప్పించింది.
35
సూపర్ స్టార్ కృష్ణకు ఇష్టమైన హీరోయిన్..
సూపర్ స్టార్ కృష్ణతో ఎక్కువ సినిమాలు చేసిన విజయ నిర్మల, జయప్రద, శ్రీదేవిలలో ఆయనకు ఫెవరేట్ హీరోయిన్ ఎవరు అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురయ్యింది. అయితే అప్పుడు ఆయనతో భార్య విజయనిర్మల కూడా ఉన్నారు. వెంటనే కృష్ణ ''నా కెరీర్ లో బెస్ట్ హీరోయిన్ ఎవరు అంటే విజయనిర్మలే అవుతుంది '' అని అన్నారు. వెంటనే విజయ నిర్మల మాట్లాడుతూ.. " అలా అనకపోతే సాయంత్రం ఇంటికెళ్లాక ఇబ్బంది అవుతుందిగా'' అని సరదాగా వ్యాఖ్యానించారు. కృష్ణ మాట్లాడుతూ.. ''నాతో నటించిన హీరోయిన్లందరు బాగా చేశారు, ముఖ్యంగా జయప్రద 45 సినిమాలు, శ్రీదేవి 30 కి పైగా సినిమాలు చేశారు. శ్రీదేవి బాలీవుడ్ లో బిజీగా ఉన్నా.. నా సినిమా అంటే వెంటనే ఒప్పుకునేవారు.'' అని కృష్ణ అన్నారు.
కృష్ణ అన్ని విషయాలలో రికార్డులు సాధించారు. 80 మంది హీరోయిన్లు, 350 కి పైగా సినిమాలు మాత్రమే కాదు.. రోజుకు మూడు షిప్ట్ లతో ఆయన పనిచేసేవారు. ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకూ ఒక సినిమా, 2 నుంచి రాత్రి 9 గంటల వరకూ ఒక సినిమా, 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకూ ఒక సినిమా.. ఇలా దాదాపు నాలుగైదేళ్లు మూడు షిప్ట్ లలో పనిచేశారు. తెలుగు పరిశ్రమలో ఎన్నో కొత్త టెక్నాలజీలను ఆయన ఆవిష్కరించారు. బాలీవుడ్, హాలీవుడ్ నటులు కూడా చేయలని ప్రయోగాత్మక పాత్రలను ఆయన చేసి చూపించారు. తెలుగు పరిశ్రమలో ప్రయోగాల హీరోగా గుర్తింపు పొందరు కృష్ణ. రాజకీయాల్లోను తనదైన ముద్ర వేశారు కృష్ణ.
55
టాలీవుడ్ కు టెక్నాలజీని పరిచయం చేసిన హీరో
కృష్ణ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి సూపర్ స్టార్ గా మారడానికి ఎంతో కష్టపడ్డారు. తెలుగు సినిమాకు కృష్ణ టెక్నాలజీ తో సొగబులద్దారు. టాలీవుడ్ లో ఫస్ట్ కలర్ సినిమా కృష్ణదే. ఫస్ట్ జేమ్స్‌బాండ్ మూవీ, ఫస్ట్ కౌబాయ్ మూవీ, డూప్స్ లేకుండా యాక్షన్ సీన్స్ చేసిన తొలి హీరో కూడా కృష్ణనే. తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం, ఫస్ట్ కలర్ సినిమా కూడా కృష్ణ చేసిందే. సింహాసనం సినిమాతో టాలీవుడ్ లో తొలి తెలుగు 70 ఎం.ఎం 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ ను పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ. ఇలా కృష్ణ టాలీవుడ్ కు అందించిన టెక్నాలజీ అంతా ఇంతా కాదు. కలర్ ప్రింట్స్ కోసం ముందుగానే ఫారెన్ కంపెనీలకు లక్షలు పంపించి, తెలుగు ప్రేక్షకులకు తమ సినిమాల ద్వారా సరికొత్త అనుభూతిని కలిగించారు కృష్ణ.