8000 కోట్ల ఆస్తితో ఫిల్మ్ ఇండస్ట్రీలో రిచెస్ట్ కపుల్ , ధనవంతులైన 6 జంటల ఎవరో తెలుసా?

Published : Sep 27, 2025, 12:09 PM IST

8000 కోట్ల ఆస్తితో ఫిల్మ్ ఇండస్ట్రీలో  రిచెస్ట్ కపుల్స్ ఎవరో తెలుసా?  సినీ కెరీర్‌తోనే కాకుండా స్మార్ట్ బిజినెస్‌లు, లగ్జరీ బ్రాండ్‌లు, ఎండార్స్‌మెంట్‌లు, స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా భారీగా సంపాదించిన టాప్  జంట ఎవరో చూద్దాం.

PREV
17
ఫిల్మ్ ఇండస్ట్రీలో రిచెస్ట్ కపుల్

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ల సంపాదన చాలా ఎక్కువ. ఒకరు కాదు జంటగా సంపాదించే స్టార్స్ కూడా ఉన్నారు పరిశ్రమలో. సినిమాలతో పాటు, బిజినెస్ లు కూడా చేస్తూ వందల, వేల కోట్లు సంపాదిస్తున్నారు.  అక్షయ్ కుమార్-ట్వింకిల్ ఖన్నా నుంచి షారుఖ్ ఖాన్-గౌరీ వరకు, ఇండస్ట్రీలో భారీ ఆస్తులున్న జంటలు కొన్ని ఉన్నాయి. వారిలో అత్యంత ధనవంతులు ఎవరో చూద్దాం.

27
టాప్ లో షారుఖ్ ఖాన్ జంట

బాలీవుడ్ లో సింగిల్ గా ధనవంతుడైన హీరో ఎవరైనా కావచ్చు, కానీ జంటగా సంపాదిస్తూ, జంటగా ఎక్కువ ఆస్తి కలిగి ఉన్న స్టార్స్ గా    షారుఖ్ ఖాన్ జంట నిలిచారు.  ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనిక నటులలో వీరు ఉన్నారు. సినిమాలు, వీఎఫ్ఎక్స్ కంపెనీ, ఐపీఎల్ టీమ్ ద్వారా భారీగా సంపాదించారు. డీఎన్ఏ ఇండియా ప్రకారం, ఈ జంట మొత్తం ఆస్తి  8096 కోట్లు.  ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  అత్యంత ధనిక జంట వీరే.

37
సైఫ్ అలీ ఖాన్ ‌- కరీనా కపూర్

సీఎన్‌బీసీ టీవీ 18 నివేదిక ప్రకారం బాలీవుడ్ లో జంటగా సంపాదిస్తున్న  స్టార్స్ లో సైఫ్, కరీనాలు కూడా ఉన్నారు. సినిమాలు, బిజినెస్ లు, బ్రాడ్ ప్రమోషన్స్ ద్వారా సంపాదిస్తున్నారు.  బాలీవుడ్ లో  కరీనా కపూర్ ఆస్తి  485 కోట్లు కాగా,  ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ ఆస్తి  1200 కోట్లు. వీరికి విలాసవంతమైన ఇళ్లు, రియల్ ఎస్టేట్ ఉన్నాయి. ఇద్దరి మొత్తం ఆస్తి  1685 కోట్లు.

47
అక్షయ్ కుమార్ - ట్వింకిల్ ఖన్నా

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఆయన  సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు మాత్రమే కాదు స్టార్టప్‌లలో పెట్టుబడుల ద్వారా భారీగా సంపాదించారు. సినిమాలకు 100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అక్షయ్. ఇక ఆయన భార్య నటి ట్వింకిల్ ఖన్నా నటనకు దూరంగా ఉన్నా, బెస్ట్ సెల్లింగ్ రచయిత్రి, వ్యాపారవేత్త. ఆమె కూడా కోట్లలో సంపాదిస్తోంది. ఇక  డీఎన్ఏ ఇండియా నివేదిక  ప్రకారం, ఈజంట మొత్తం ఆస్తి 3542 కోట్లు.

57
రాణీ ముఖర్జీ జంట టాప్ 2

యశ్‌రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా, దేశంలోని శక్తివంతమైన ప్రొడక్షన్ హౌస్‌ను నిర్మించారు. డీఎన్ఏ నివేదిక ప్రకారం, ఆయన ఆస్తి  7200 కోట్లు. ఆయన భార్య రాణి ముఖర్జీ ఆస్తి  200 కోట్లు. ఇద్దరి మొత్తం ఆస్తి  7400 కోట్లు. కెరీర్ పరంగా బిజీ లైఫ్ ను లీడ్ చేసిన రాణి ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లాడి మరింత రిచ్ గా మారింది. 

67
టాప్ 3 లో సోనమ్ కపూర్

నటి సోనమ్ కపూర్ వ్యక్తిగత ఆస్తి కంటే, ఆమె భర్త ఆనంద్ అహూజా ఆస్తి చాలా ఎక్కువ. ఆనంద్ అహూజా  ప్రముఖ వ్యాపారవేత్త. ఫ్యాషన్ లేబుల్, స్నీకర్ స్టోర్ వ్యవస్థాపకుడైన ఆనంద్ ఆస్తి  4805 కోట్లు. డీఎన్ఏ ఇండియా ప్రకారం, వీరిద్దరి మొత్తం ఆస్తి  4900 కోట్లు. బాలీవుడ్ లో అత్యధిక ధనవంతులైన జంటల్లో వీరు మూడో స్థానంలో ఉన్నారు. 

77
జంటగా సంపాదిస్తున్నారు

ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్  అనుష్క శర్మ ఆస్తి 300 కోట్లు. ఆమె భార్త  క్రికెటర్  విరాట్ కోహ్లీ ఆస్తి దాదాపు  1000 కోట్లు. బ్రాండ్ అంబాసిడర్స్ లిస్ట్ లో టాప్ లో ఉన్నాడు విరాట్, బ్రాండ్ ఎండోర్మెంట్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు.  జీక్యూ నివేదిక ప్రకారం, ఫ్యాషన్ లేబుల్స్, లగ్జరీ ఎండార్స్‌మెంట్లు, స్పోర్ట్స్ పెట్టుబడులతో వీరి మొత్తం సంపద దాదాపు  1300 కోట్లకు పైనే ఉంటుందని అంచన.

Read more Photos on
click me!

Recommended Stories