2025లో తెలుగు దర్శకులకు పోటీ ఇస్తూ.. వరుస సక్సెస్ లతో దూసుకుపోయారు తమిళ డైరెక్టర్లు. ఈ ఏడాది కోలీవుడ్ లో ఉత్తమ దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్న టాప్ 5 డైరెక్టర్లు ఎవరో తెలుసా?
ప్రతి సంవత్సరం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ ఏడాది చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ వరకు వేల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కోలీవుడ్ లోనే దాదాపు 500కి పైగా సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల ఆధారంగా, ఉత్తమ కథ, విమర్శల ఆధారంగా ఉత్తమ దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్న వారి గురించి చూద్దాం.
26
లోకేష్ కనగరాజ్ కు స్టార్ ఇమేజ్..
ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీ నుంచి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్. ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన 'కూలీ' ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ఇండియన్ సినిమాలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. లోకేష్ నెక్ట్స్ టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరకంగా పాన్ ఇండియాకు వెళ్లాలని ప్లాన్.
36
అశ్వంత్ మారిముత్తు
తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ దర్శకుడు తన ప్రతిభ చూపించాడు. 'ఓ మై కడవులే' చిత్రంతో అశ్వంత్ మారిముత్తు మంచి గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'డ్రాగన్' విమర్శకుల ప్రశంసలతో పాటు, బాక్సాఫీస్ వద్ద రూ.152 కోట్లు వసూలు చేసి 4వ స్థానంలో నిలిచింది.
'సూరరై పోట్రు'తో దర్శకుడిగా మారిన కీర్తీశ్వరన్ తీసిన 'డ్యూడ్' యువతను ఆకట్టుకుంది. ప్రేమకథా చిత్రంగా వచ్చిన ఈ సినిమా రూ.100 కోట్లు వసూలు చేసి, అత్యధిక వసూళ్ల జాబితాలో 7వ స్థానం పొందింది. ఈ రకంగా కీర్తీశ్వరన్ టాప్ డైరెక్టర్లలో స్థానం సంపాదించాడు.
56
అభిషన్ జీవింత్
శశికుమార్, సిమ్రాన్ కాంబోలో వచ్చిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.90 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈసినిమా దర్శకుడు అభిషన్ జీవింత్ కు కోలీవుడ్ లో భారీగా డిమాండ్ పెరిగింది. టాలీవుడ్ నుంచి కూడా నానీ అతనికి అవకాశం ఇచ్చాడని టాక్.
66
రాజేశ్వర్ కాళీసామి
ఈ జాబితాలో తర్వాతి స్థానంలో 'కుటుంబస్థన్' దర్శకుడు రాజేశ్వర్ కాళీసామి ఉన్నారు. మధ్యతరగతి జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు, బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.