Megastar Chiranjeevi: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క హిట్టు కోసం హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు తహతహలాడుతుంటారు. దేవుడిని వేడుకుంటారు. కానీ భగవంతుడా ఒక్క ప్లాప్ సినిమా ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో దేవుడుపై నమ్మకం ఉన్న ఏ దర్శకుడైనా తన సినిమా సూపర్ హిట్ అవ్వాలని వేడుకుంటాడు. దేవడా ప్లాప్ పడకుండా చూడు అని ప్రార్థిస్తాడు. కానీ టాలీవుడ్ లో వరుస విజయాలతో విసిగిపోయిన ఓ దర్శకుడు మాత్రం ఒక్క ప్లాప్ ఇవ్వు స్వామీ.. అని వేడుకున్నాడట. ఇంతకీ ఆదర్శకుడు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవితో దాదాపు 23 సినిమాలు చేసి, మెగాస్టార్ కెరీర్ ను నిలబెట్టిన కోదండరామిరెడ్డి. చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో ఖైదీ, పసివాడి ప్రాణం, అభిలాష, ఛాలెంజ్, ముఠామేస్త్రీ లాంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి. ఒక రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవిని మెగాస్టార్ గా నిలబెట్టిన దర్శకుడు కోందడరామిరెడ్డి.
25
చిన్న వయసులోనే స్టార్ డైరెక్టర్ గా..
కోదండరామిరెడ్డి చాలా చిన్నవయసులోనే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 28 ఏళ్లకే దర్శకుడిగా జర్నీ స్టార్ట్ చేసి.. మొదటి సినిమా సంధ్యతోనే హిట్ కొట్టాడు. అంత చిన్న వయసులో ఆయన సాధించిన ఘనతను ఇండస్ట్రీ అంతా ప్రత్యేకంగా చెప్పుకుంది. పెద్ద పెద్ద నిర్మాతల చూపు.. కోదండరామిరెడ్డిపై పడింది. అప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న క్రాంతికుమార్ కు ఆయన గురించి తెలిసింది. సంధ్య సినిమా చూసిన క్రాంతికుమార్.. కోదండరామిరెడ్డిని ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించారు. చిరంజీవితో సినిమా చేయాలి అనకుుంటున్నాను. అది నువ్వే చేద్దువుగాని అని హామీ కూడా ఇచ్చాడు. ఇక అప్పుడు న్యాయం కావాలి సినిమాతో మొదలైన ప్రయాణం.. చిరంజీవిని మెగాస్టార్ ను చేసింది. అయితే కోదండరామిరెడ్డి ఎంత బిజీ డైరెక్టర్ గా ఉండేవారంటే.. ఆయన ఒక దశలో ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయారు.
35
దేవుడా ఒక ప్లాప్ ఇవ్వు అని కోరుకున్న దర్శకుడు
కోదండరామిరెడ్డి కెరీర్ లో వరుసగా 16 హిట్లు పడ్డాయి. చిరంజీవితోచేసిన ప్రతీ సినిమా హిట్ అవుతూ వచ్చింది. అటు కృష్ణతో కిరాయి కోటిగాడు లాంటి హిట్ సినిమాలు చేసిన కోదండరామిరెడ్డికి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. నిర్మాతలు ఆయన ఇంటికి క్యూ కట్టారు.. మా సినిమా చేయమంటే మా సినిమా చేయండి అని అడ్వాన్స్ లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇంటి నుంచి బయటకు వస్తే.. షూటింగ్ కు తీసుకెళ్లడానికి 10 కార్లు ఆయన ఇంటి ముందు ఉండేవి. ఏ కారు ఎక్కితే ఏ షూటింగ్ కు వెళ్తామో కూడా తెలియని పరిస్థితుల్లో.. బిజీ దర్శకుడిగా పనిచేశారు కోదండరామిరెడ్డి. అయితే అంత ఒత్తిడిలో కూడా ఆయన సినిమాలు అద్భుతంగా తెరకెక్కించేవారు. వరుసగా 16 బ్లాక్ బస్టర్ సినిమాలు డైరెక్ట్ చేశారు కోదండరామిరెడ్డి. ఉదయం 5 గంటలకు కూడా నిర్మాతలు వచ్చి.. నిద్రలేపి అడ్వాన్స్ లు తీసుకోమంటుంటే.. ఆ ప్రెజర్ తట్టుకోలేకపోయారు సీనియర్ దర్శకుడు. ఒక దశలో ఈ ఒత్తిడి తట్టుకోలేక దేవుడా ఒక్క ప్లాన్ సినిమా ఇవ్వు అని కోదండరామిరెడ్డి వేడుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
చిరంజీవి హీరోగా కొదండరామిరెడ్డి డైరెక్షన్ లో 23 సినిమాలు వచ్చాయి. అందులో ఒకటీ రెండు తప్పించి దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. న్యాయం కావాలి సినిమాతో మొదలై వీరి జర్నీ.. ఖైదీ, అభిలాష, ఛాలెంజ్ , రుస్తూం, దొంగ, విజేత, కిరాకతకుడు, రాక్షసుడు, వేట, రక్త సింధూరం, ముఠా మేస్త్రీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో కొనసాగింది. చిరంజీవికి స్టార్ హీరోగా లైఫ్ ఇచ్చారు కోదండరామిరెడ్డి. అయితే ఎక్కడ ప్రాబ్లమ్ జరిగిందో ఏమో కాని.. వీరి మధ్య మాత్రం అంతగా సఖ్యత కనిపించడంలేదు. చిరంజీవి కూడా తన కెరీర్ ను నిలబెట్టిన దర్శకుడిగా కోదండరామిరెడ్డి ప్రస్తావన ఎక్కడా తీసుకువచ్చినట్టు కనిపించలేదు.
55
కోదండరామిరెడ్డిని మెగాస్టార్ అవమానించాడా?
చిరంజీవి తనను స్టార్ గా నిలబెట్టి, లైఫ్ ఇచ్చిన దర్శకుల లిస్ట్ లో కోదండరామిరెడ్డిని చేర్చలేదు. కొన్ని సందర్బాలలో తన దర్శకుల గురించి మాట్లాడాల్సి వస్తే.. మెగాస్టార్ కోదండ రామిరెడ్డి పేరు అసలు చెప్పకపోవడం ఆశ్చర్య కరం. మరి వీరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఓ ఇంటర్వ్యూలో కోదండరామిరెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు. చిరంజీవి తన దర్శఖుల గురించి మాట్లాడుతూ.. తన పేరు కనీసం ప్రస్తావించకపోవడం తనను బాధించిందని.. ఎవరు ఏమనుకున్నా.. ఆ విషయంలో చిరంజీవి అలా చేయడం కరెక్ట్ కాదు అని ఆయన అన్నారు. ఈరకంగా మెగాస్టార్ కోదండరామిరెడ్డిని అవమానించారని కొంత మంది నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇండస్ట్రీలో నిలబెట్టిన దర్శకుడిని చిరంజీవి ఎందుకు దూరం పెట్టాడా అని చర్చించకుుంటున్నారు.