అతనో స్టార్ హీరో.. 100 సినిమాలు పూర్తి చేసిన నటుడు, అందులో 40 సినిమాలు ప్లాప్ అయ్యాయి, 33 సినిమాలు అసలు రిలీజ్ అవ్వలేదు. కానీ ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ సాదించాడు. ఇన్నేళ్ల మూవీ కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పేస్ చేసిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. వరుసగా నాలుగైదు ఫెయిల్యూస్స్ వస్తే.. ఇక తట్టా బుట్టా సర్ధుకుని ఇంటికి వెళ్లాల్సిందే. కానీ కొంత మంది హీరోలు మాత్రం ఎన్ని ఫెయిల్యూన్స్ ఎదురైనరా ధైర్యంగా ఇండస్ట్రీలో నిలబడ్డారు. వారి ఇమేన్ ను కోల్పోలేదు, స్టార్ డమ్ ను కోల్పోలేదు. కొన్నాళ్లు ఫామ్ లో లేకపోయినా ఆతరువాత మళ్లీ నిలబడ్డాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?
26
అన్నా అని ముద్దుగా పిలుచుకునే హీరో..
సునీల్ శెట్టిని బాలీవుడ్‌లో అందరితో అన్నా అని చాలామంది ముద్దుగా పిలుచుకునే ఈ హీరో నటన, స్టైల్, డైలాగ్ డెలివరీకి పేరున్న నటుడిగా సునీల్ శెట్టికి మంచి ఇమేజ్ ఉంది. అందరికంటే ఆయన చాలా భిన్నంగా ఆలోచిస్తారు. 60 ఏళ్ల వయసులో కూడా ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ.. టోన్డ్ బాడీని మెయింటేన్ చేస్తూ.. యాక్షన్ డైలాగ్స్ తో రొటీన్ కు భిన్నంగా ఉంటారు సునీల్ శెట్టి. చిన్నప్పుడు క్రికెటర్ కావాలనుకున్న సునిల్ .. అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల్లో స్థానం సంపాదించడం సులభం కాదని, ఇడ్లీలు అమ్ముకోవడం మేలని ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు సునిల్ శెట్టి.
36
కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలు
కెరీర్ బిగినింగ్ లో సునిల్ శెట్టి చాలా తిరస్కారాలు ఫేస్ చేశాడు. ఆయన లుక్ కారణంగా ఆయన్ను రకరకాలుగా అవమానించారు. ఏ దర్శకుడు సునిల్ కు అవకాశం ఇవ్వలేదు, ఏ హీరోయిన్ కూడా ఆయనతో జత కట్టడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సినిమాలు ఆయనకు చేతకావని విమర్శించారట. 1992లో 'బల్వాన్' సినిమాతో సునీల్ శెట్టి కెరీర్ మొదలైంది. 1994లో వచ్చిన 'మొహ్రా' ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. తర్వాత 'గోపి కిషన్'లో డబుల్ రోల్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఆతరువాత తిరిగి చూసుకోలేదు బాలీవుడ్ హీరో.
‘యే తేరా ఘర్ యే మేరా ఘర్’, ‘హేరా ఫేరీ’, ‘దే దనా దాన్’ సినిమాలతో మంచి గుర్తింపు సాధించిన సునిల్ శెట్టికి .. 2001లో వచ్చిన 'ధడ్కన్' సినిమాకు ఉత్తమ విలన్ అవార్డు వచ్చింది. ఇండస్ట్రీలో ఎవరైతే విమర్శించారో.. వారి నోర్లు మూతపడేలా తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు సునీల్ శెట్టి. ఇప్పటివరకు 100కు పైగా సినిమాల్లో నటించిన ఆయకు 40 సినిమాలు ప్లాప్ లు ఎదురయ్యాయి, 33 సినిమాలు అసలు రిలీజజ్ కాలేదు. కానీ 90ల దశకంలో టాప్ హీరోలలో ఒకరిగా సునీల్ శెట్టి నిలిచారు.
56
సునిల్ శెట్టి విచిత్ర ప్రేమ కథ
ఇక సునిల్ శెట్టి ఆస్తి విషయానికి వస్తే.. 125 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ముంబయ్ లో లగ్జరీ హౌస్ తో పాటు.. కొన్ని ప్లాట్లు కూడా ఉన్నాయట.ఇక సునిల్ శెట్టిప్రేమ వివాహం చాలా చిత్రంగా జరిగింది. ఆయన ప్రేమించిన అమ్మాయి మాన. ఆమె తండ్రి గుజరాతీ ముస్లిం, తల్లి పంజాబీ. సునీల్ శెట్టిది కర్ణాటక తుళు కుటుంబం. దాంతో వీరి పెళ్ళికి సంస్కృతి, మతం, కులం అడ్డుగా నిలిచాయి. రెండు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ సునీల్, మాన ప్రేమను వదులుకోలేదు. రెండు ఫ్యామిలీస్ పెళ్లికి పెళ్ళికి ఒప్పుకునే వరకూ వారు ఎదరుచూశారు. వీరిద్దరి పట్టుదల, ప్రేమను గమనించిన పెద్దలు వెంటనే పెళ్లికి ఒప్పుకున్నారు.
66
సౌత్ సినిమాల్లో విలన్ గా బాలీవుడ్ హీరో
సునిల్ శెట్టి ప్రేమలో పడ్డ 9 ఏళ్ల తర్వాత 1991 డిసెంబర్ 25న వీరి పెళ్లి జరిగింది. సునీల్ శెట్టి వృత్తి కంటే వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా వార్తల్లో ఉంటారు. ఆయన పూర్తిగా కుటుంబానికి అంకితమైన వ్యక్తి. ఎక్కువగా కుటుంబంతో సమయం గడుపుతారు. పార్టీలు, పబ్ లు అంటూ బయట తిరిగే అలవాటు లేదు. ఫిట్ నెస్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోలలో సునిల్ ముందున్నారు. ఇక ఈమధ్య కాలంలో సౌత్ సినిమాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు సునిల్ శెట్టి. విలన్ పాత్రల్లో మెరుస్తున్నాడు.