Top 5 OTT Movies and Series: ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను ఓర్మాక్స్ మీడియా విడుదల చేసింది. ఇందులో రజనీకాంత్ `కూలీ`కి `మహావతార్ నరసింహ` షాకిచ్చింది. ఆ కథేంటో చూద్దాం.
ఈ మధ్య ఓటీటీలకు ఆదరణ పెరుగుతుంది. థియేటర్ కంటే ఓటీటీలోనే సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలో వస్తుండటంతో దానికే ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో థియేటర్‌కి వచ్చి చూసే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఇంట్లో నుంచే ఏ భాషా చిత్రాన్నైనా చూసే సౌలభ్యం ఓటీటీ కల్పిస్తోంది. దీంతో థియేటర్లో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో బాగా ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు ఓటీటీలో ఎక్కువ వ్యూస్ పొందిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాని విడుదల చేసింది ఓర్మాక్స్ మీడియా. ఇది ప్రతి వారం ఈ డేటాని అందిస్తుంది.
24
ఓటీటీలో టాప్ 4లో రజనీకాంత్ `కూలీ`
ఓటీటీలో అత్యధిక వ్యూస్ పొందిన చిత్రాల జాబితాలో బాలీవుడ్ మూవీ 'సన్ ఆఫ్ సర్దార్ 2' ఐదో స్థానంలో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి 19 లక్షల వ్యూస్ వచ్చాయి. రజినీకాంత్ 'కూలీ' నాలుగో స్థానానికి పడిపోయింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రానికి గత వారం 30 లక్షల వ్యూస్ వచ్చాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఊపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, సౌబిన్ షాహిర్ ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 14న ఈ చిత్రం విడుదలై థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ ఐదు వందల కోట్ల వసూళ్లని రాబట్టింది. అయినప్పటికీ హిట్ జాబితాలో చేరలేకపోయింది.
34
ఓటీటీలో నెంబర్ 1గా మహావతార్ నరసింహ
ఈ జాబితాలో మోహన్‌లాల్ 'హృదయపూర్వం' మూడో స్థానంలో ఉంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి 34 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ మూవీ థియేటర్లలోనూ సత్తా చాటింది. ఇప్పుడు దాన్ని మించి ఓటీటీలో మంచి వ్యూస్ సాధిస్తోంది. ఇక థియేటర్లో దుమారం రేపిన బాలీవుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ 'సైయారా' రెండో స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి 45 లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతపాటు యానిమేషన్ మైథలాజికల్ ఫిల్మ్ 'మహావతార్ నరసింహ' 57 లక్షల వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉంది. థియేటర్లలోనూ ఈ మూవీ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం థియేటర్లలో ఏకంగా రూ.325కోట్లు రాబట్టింది. ఈ మూవీ బడ్జెట్ కేవలం రూ.15కోట్లు మాత్రమే కావడం విశేషం.
ఓటీటీలో టాప్‌లో `ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్` వెబ్ సిరీస్
అత్యధిక వ్యూస్ పొందిన వెబ్ సిరీస్‌ల జాబితాలో 'వెన్స్‌డే' సీజన్ 2 (.8 మిలియన్ వ్యూస్) ఐదో స్థానంలో ఉంది. తమన్నా నటించిన 'డూ యు వానా పార్టనర్' ( 1.3M)నాలుగో స్థానంలో ఉంది. 'సిక్సర్స్' సీజన్ 2(1.8M) మూడో స్థానంలో, 'ది ట్రయల్' సీజన్ 2(2.8M) రెండో స్థానంలో ఉన్నాయి. ఆర్యన్ ఖాన్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' 57 లక్షల వ్యూస్‌తో మొదటి స్థానంలో నిలిచింది. బాలీవుడ్ సెలబ్రిటీల తెరవెనుక జీవితాలు, లవ్ స్టోరీస్, లస్ట్ వంటి అంశాలను ప్రధానంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించారు. ఇందులో బాలీవుడ్ మొత్తం గెస్ట్ లు మెరిశారు. అంతేకాదు తెలుగు నుంచి రాజమౌళి కూడా కాసేపు అలరించారు. దీంతో భారీ హైప్ నెలకొంది. దీనికితోడు తమన్నా స్పెషల్ సాంగ్ దుమ్ములేపింది. ఓటీటీలో ఈ సిరీస్‌ని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. దీనికి 5.7 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.