కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (సెప్టెంబర్ 30వ తేదీ)లో దీపకు భోజనం పెట్టి.. మాటలతోనే నరకం చూపిస్తుంది సుమిత్ర. తల్లికూతుర్లు ఒక్కటైపోయారు అంటుంది జ్యోత్స్న. నా గురించి నీకు ఇప్పటికైనా తెలిసిందా అంటుంది పారు. అసలు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
కార్తీక దీపం 2 మంగళవారం ఎపిసోడ్ లో కళ్లు తిరిగి కిందపడిన దీపను లేపి భోజనం తినమని ప్లేటు తీసుకొస్తుంది సుమిత్ర. భోజనం పెట్టేంత మానవత్వం నాకుంది కానీ తినిపించేంత ప్రేమ లేదు అంటుంది. నువ్వు మీ ఇంట్లో పడిపోతే నేను ఇంత కంగారు పడేదాన్ని కాదు. అందరున్నప్పుడు పడిపోయిన నాకు బాధ ఉండేది కాదు. ఇంట్లో ఎవ్వరు లేని టైంలో నీకు ఇలా జరిగింది. నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి పట్టించుకోవద్దు అనుకున్నా.. నాలోని అమ్మతనం ఒప్పుకోదు. నువ్వుంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నీకు ఏమైనా అయితే.. నేనే చేశానని అనుకుంటారని సుమిత్ర.. దీపతో అంటుంది.
25
అప్పటి దీప, సుమిత్రలు వేరు..
ఈ మాట నిజంగా మీ మనుసులో నుంచే వచ్చిందా? అని దీప సుమిత్రను అడుగుతుంది. భోజనం చేస్తూ వినమని ప్లేట్ అందిస్తుంది సుమిత్ర. ఇంతకుముందు దీప వేరు. అప్పుడు దీపకు ఆవేశం, నిజాయతీ ఉండేది. ఇప్పుడు నిజాయతీ స్థానంలో స్వార్థం పెరిగిపోయింది అంటుంది. ఆ మాటలు వింటూ ఏడుస్తూనే దీప భోజనం చేస్తుంది.
ఒకప్పుడు నేను అందరితో ప్రేమగా ఉండేదాన్ని. ఇప్పుడు నాలో ప్రేమ మాయం అయింది. నాలో ఈ మార్పు రావడానికి కారణం నువ్వే. నువ్వు తిండి మానేసినంత మాత్రానా నీ మీద నాకు కోపం పోదు. నా భర్తను కావాలనే షూట్ చేశానని ఒప్పుకుంటేనే అది పోతుంది. కానీ నువ్వు ఒప్పుకోవు. కార్తీక్ ఒప్పుకోనివ్వడు అంటుంది. నేను నా భర్త దూరంగా ఉండడానికి కారణం నువ్వే. నేను తప్పు చేయడానికి కూడా కారణం నువ్వే అంటూ దీపను నానామాటలు అంటుంది సుమిత్ర. ఏడుస్తూ భోజనం చేస్తున్న దీప మీరు నన్ను కొట్టినా ఇంత బాధకలిగేది కాదని బోరుమంటుంది. కత్తి లేకున్నా చేతులతోనే ప్రాణం తీయగలవు నువ్వు అంటుంది సుమిత్ర దీపను. అప్పుడు దీపకు పొలమారితే తలపై తట్టి నీళ్లు తాగిస్తుంది సుమిత్ర. అప్పుడే ఇంట్లోకి వచ్చిన కార్తీక్, జ్యో, పారు అది చూసి షాక్ అవుతారు.
35
మా అమ్మ నాతో దారుణంగా మాట్లాడింది
దీపకు భోజనం పెట్టానని కార్తీక్ తో అంటుంది సుమిత్ర. కళ్లు తిరిగి పడిపోయిన మనిషిని చూసి వదిలేయడం మానవత్వం కాదని భోజనం పెట్టా. ప్రేమ పొంగిపోయి కాదని అంటూ లోపలికి వెళ్తుంది సుమిత్ర. మేం ఇస్తే తినవు. కానీ మీ అమ్మ భోజనం పెడితే మాత్రం తింటావని దీపతో కార్తీక్ అంటాడు. అత్తలోని మంచితనాన్ని ఎవరూ దూరం చేయలేరని అంటాడు. నాతో మా అమ్మ దారుణంగా మాట్లాడిందని చెబుతుంది కార్తీక్ తో దీప.
మరోపక్క నాకు భయం మొదలైంది గ్రానీ. దీప పడిపోయిందని మా మమ్మీ భోజనం పెట్టింది. ఏడుస్తుందని చేరదీస్తే ఎలా? ఆ తల్లి కూతుర్లు ఒక్కటైపోతారు.. అని నోరు జారుతుంది జ్యోత్స్న. మళ్లీ పారిజాతానికి నిజం తెలియదా కదా అని.. ఆ మాటను కవర్ చేస్తుంది. మనమిద్దరం ఒక్కటిగా ఉండాలని పారును కోరుతుంది. నీకు నేనంటే ఏంటో ఇప్పటికైనా అర్థం అయింది అనుకుంటున్నానని అంటుంది పారు. నా మనువడు, కొడుకును నువ్వు చూసుకో నిన్ను నేను చూసుకుంటాను అంటుంది పారు.
55
కాంచనకు డబ్బులిచ్చిన శ్రీధర్
మరోవైపు ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకొని కాంచన ఇంటికి వస్తాడు శ్రీధర్. కాంచనకు డబ్బులు కూడా ఇస్తాడు. ఇవన్నీ ఎందుకు తెచ్చావు. మేము నిన్ను అడగలేదే అంటుంది కాంచనా. మీరు నా బాధ్యత. నన్ను అర్థం చేసుకో కాంచనా అంటాడు శ్రీధర్. డబ్బులు లేకపోతే ఏ పని జరగదు. నేనిచ్చింది డబ్బు కాదు ధైర్యం. ఇప్పుడు తీసుకొని మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు. కానీ ఈ విషయం కార్తీక్ తో చెప్పొద్దు అంటాడు. అంతలో అక్కడికి కార్తీక్, దీప రావడంతో కాంచన డబ్బు దాచేస్తుంది. ఈ సరుకులు ఎవరు తెచ్చారని అడుగుతాడు కార్తీక్ అనసూయను. మీ నాన్న తీసుకొచ్చాడని ఆమె చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగుస్తుంది.