ఓటీటీల వల్ల సినిమాలో చాలా మార్పులు వచ్చాయి. థియేటర్లో 25, 50, 100 రోజులు సినిమా ఆడేది. ఇప్పుడు వారం ఆడితేనే గొప్ప. 28 రోజుల్లో ఓటీటీలో వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు థియేటర్లలో సందడి చేసిన కొన్ని సినిమాలు ఓటీటీలోనూ ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా ఓటీటీలో ఎక్కువగా చూసిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి ఇక్కడ చూద్దాం.
24
టాప్ 5 `సింగిల్`, టాప్ 4లో `అలప్పుజ జింఖానా`
జూన్ 16 నుండి 22 వరకు ఓటీటీలో ఎక్కువగా చూసిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను ఓర్మాక్స్ విడుదల చేసింది. టాప్ 5లో సింగిల్ 5వ స్థానంలో ఉంది. ఈ తెలుగు సినిమాకి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్‌లో 30 లక్షల వ్యూస్ వచ్చాయి.
సోనీ లివ్‌లో `అలప్పుజ జింఖానా` 4వ స్థానంలో ఉంది. నెస్లెన్, అనకా రవి నటించిన ఈ సినిమాకి కలీద్ రెహమాన్ దర్శకత్వం వహించారు. ఇది 32 లక్షల వ్యూస్ పొందింది.
3వ స్థానంలో `టూరిస్ట్ ఫ్యామిలీ` ఉంది. శశికుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకి అభిషన్ జీవింద్ దర్శకత్వం వహించారు. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి 34 లక్షల వ్యూస్ వచ్చాయి.
మొదటి రెండు స్థానాల్లో హిందీ సినిమాలు ఉన్నాయి. సన్నీ డియోల్ `జాట్` 2వ స్థానంలో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో రన్ అవుతున్న ఈ చిత్రానికి 35 లక్షల వ్యూస్ వచ్చాయి. `కేసరి చాప్టర్ 2` మొదటి స్థానంలో ఉంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి 58 లక్షల వ్యూస్ వచ్చాయి.
వెబ్ సిరీస్ కి సంబంధించి చూస్తే `లఫాంగే` సిరీస్ 5వ స్థానంలో ఉంది. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కి 28 లక్షల వ్యూస్ వచ్చాయి. `ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో` సీజన్ 3 4వ స్థానంలో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి 30 లక్షల వ్యూస్ వచ్చాయి.
`ది ట్రెయిటర్స్` 3వ స్థానంలో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్‌కి 42 లక్షల వ్యూస్ వచ్చాయి. `రానా నాయుడు` సీజన్ 2 2వ స్థానంలో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఈ సిరీస్‌కి 52 లక్షల వ్యూస్ వచ్చాయి. `క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్` మొదటి స్థానంలో ఉంది. జియో హాట్‌స్టార్‌లో రన్ అవుతున్న ఈ సిరీస్‌కి 57 లక్షల వ్యూస్ వచ్చాయి.