కమల్ హాసన్ అమరన్ కి ముందు నిర్మించిన టాప్ 5 బ్లాక్ బస్టర్ సినిమాలు

First Published | Nov 6, 2024, 2:26 PM IST

హీరోగానే కాదు కమల్ హాసన్ నిర్మాతగా కూడా భారీ విజయాలు అందుకున్నారు. రీసెంట్ గా  శివకార్తికేయన్  హీరోగా  అమరన్ సినిమాను నిర్మించారు కమల్ హాసన్ ఈసినిమా సక్సెస్ అయిన సందర్భంగా  ఆయన ఇంతకు ముందు నిర్మించిన 5 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇవే. 

కమల్ హాసన్

కమల్ హాసన్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. ఆయన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో ఇటీవల నిర్మించిన అమరన్ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శిస్తుంది.

దాదాపు 150 కోట్ల వసూళ్లను దాటి థియేటర్లలో వసూళ్ల వేట కొనసాగిస్తుంది అమరన్. ఈ సినిమాకు ముందు కమల్ నిర్మించిన 5 బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు. ఇక వాటి గురించి తెలుసుకుందాం.

అపూర్వ సహోదరులు

అపూర్వ సహోదరులు

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1989లో విడుదలైన చిత్రం అపూర్వ సహోదరులు. ఈ చిత్రంలో కమల్ హాసన్ మూడు విభిన్న పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కూడా కమలే నిర్మించారు. కమల్ కెరీర్‌లో ఒక మైలురాయిగా ఈ చిత్రం నిలిచింది. ముఖ్యంగా అప్పు పాత్రలో కమల్ నటన అందరినీ ఆకట్టుకుంది.


తేవర్ మగన్

తేవర్ మగన్

కమల్ హాసన్ నటించి, నిర్మించడమే కాకుండా కథ, మాటలు కూడా రాసిన సినిమా తేవర్ మగన్. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా లభించింది. అలా గుర్తుండిపోయే తమిళ సినిమాలో  ఇది ఒకటి. 1992లో దీపావళికి విడుదలైన ఈ సినిమా  బాక్సాఫీస్ వద్ద కూడా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు గౌతమి, శివాజీ గణేశన్ నటించారు. భరతన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

విరుమాండి

విరుమాండి

కమల్ హాసన్ నిర్మాణంలో 2004లో రిలీజ్ అయి సినిమా విరుమాండి. ఈ మూవీకి కమలే దర్శకత్వం వహించి, హీరోగా కూడా నటించారు. ఇందులో కమల్ హాసన్  ఒక పక్కా పల్లెటూరి మాస్ వ్యక్తిగా జీవించారు. ఈ చిత్రంలోనే మొదటిసారిగా లైవ్ డబ్బింగ్ జరిగింది. ఈ చిత్రం తమిళ సినిమా చరిత్రలో ఒక విలువైన చిత్రంగా పరిగణించబడుతుంది. ఈ చిత్రంలో కమల్‌తో పాటు పసుపతి, అభిరామి వంటి పెద్ద నటులు కనిపించారు. 

విశ్వరూపం

విశ్వరూపం

తమిళ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం అంటే అది కమల్ విశ్వరూపమే. ఈ చిత్రం 2013లో విడుదలైంది. ఈ చిత్రాన్ని మొదట నేరుగా టీవీలో విడుదల చేయాలని కమల్ హాసన్ అనుకున్నారు. అప్పుడు దానికి వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కానీ కాలక్రమేణా అదే ఇప్పుడు OTT వేదికలుగా రూపాంతరం చెందింది.

విక్రమ్

విక్రమ్ 

కమల్ హాసన్ కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్ అందుకున్న సినిమా విక్రమ్. ఈ చిత్రానికి ముందు దాదాపు 4 సంవత్సరాలు సినిమాల్లో నటించకుండా ఉన్న కమల్ హాసన్ విక్రమ్ చిత్రం ద్వారా అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చారు.  ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. 2022లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 450 కోట్లకు పైగా వసూలు చేసింది.

Latest Videos

click me!