లేటెస్ట్ ఓటీంగ్‌ సర్వే, డేంజర్‌ జోన్‌లో ఆ ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు, నాగ్‌ ఫేవరేట్‌ ఈ వారం ఔట్‌?

First Published | Nov 6, 2024, 1:34 PM IST

డేంజర్‌ జోన్‌లోకి ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు. అంతేకాదు హోస్ట్ నాగార్జున ఫేవరేట్‌ కంటెస్టెంట్‌ కూడా డేంజర్‌లోనే ఉండటం గమనార్హం. మరి ఈ వారం ఎవరు హౌజ్‌ని వీడబోతున్నారు?
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 పదో వారానికి చేరుకుంది. టాస్క్ లో కంటెస్టెంట్లు బిజీగా ఉన్నారు. గత వారం నయనీ పావని ఎలిమినేట్‌ అయ్యింది. ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌజ్‌లో ఉన్నది చాలా వరకు స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లు అనే చెప్పాలి. అయితే ఈ వారం నుంచి వాళ్లు కూడా ఒక్కొక్కరుగా బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్‌ అవుతారనేది చెప్పడం కష్టం. కానీ ఊహించని కంటెస్టెంట్లు హౌజ్‌ని వీడే అవకాశం ఉంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఈ నేపథ్యంలో పదో వారం ఎవరు ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరికి తక్కువ ఓట్లు వస్తున్నాయి. ఎవరు వీక్ గా ఉన్నారనేది లేటెస్ట్ సర్వే ప్రకారం చూస్తే, ఓటింగ్‌ ప్రక్రియ ప్రకారం స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లు ఈ వారం డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అయ్యే ప్రమాదం ఉంది.

పదో వారం నామినేషన్‌లో గౌతమ్‌, నిఖిల్‌, ప్రేరణ, పృథ్వీరాజ్‌, యష్మి, హరితేజ, విష్ణు ప్రియా ఉన్నారు. ఈ ఏడుగురు స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లు అనే చెప్పొచ్చు. మరి వీరిలో ఎవరిని బిగ్‌ బాస్‌ పంపించబోతున్నారు, ఆడియెన్స్ ఎవరు హౌజ్‌ని వీడాలనుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. 
 


ఇదిలా ఉంటే ఈ వారం ఓటింగ్‌లో దుమ్ములేపుతున్నాడు గౌతమ్‌. రెండు వారాల క్రితం ఆయన ఎలిమినేట్‌ కావాల్సింది. మణికంఠ స్వయంగా ఎలిమినేట్‌ కావడంతో బతికిపోయాడు. దాన్నుంచి తన తప్పు తెలుసుకున్నాడు గౌతమ్‌. గేమ్‌ మార్చేశాడు. లీస్ట్ నుంచి టాప్‌లోకి వెళ్లాడు. యష్మితో గొడవ ఆయనకు కలిసి వచ్చింది. ట్రయాంగిల్‌ లవ్‌ ట్రాక్‌ ఇంకా బాగా కలిసి వచ్చింది.

నిఖిల్‌, యష్మి, పృథ్వీరాజ్‌లను గౌతమ్‌ టార్గెట్‌ చేయడం, వాళ్లకి గౌతమ్‌ టార్గెట్‌ కావడంతో అది ఓట్ల రూపంలో హెల్ప్ అయ్యింది. గత వీకెండ్‌లో గౌతమ్‌ని అనవసరంగా ఇరికిస్తున్నారనే విషయం ప్రొజెక్ట్ అయ్యింది. ఇది ఆయనకు సింపతిగా మారింది. అవి ఓట్లుగా మారుతున్నాయి. దీంతో అందరికి షాకిస్తూ ఈ సారి టాప్‌లోకి వెళ్లిపోయారు గౌతమ్‌. 25 శాతంఓటింగ్‌తో టాప్‌లో ఉండటం విశేషం.

మరో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ నిఖిల్‌ కూడా టాప్‌లోనే ఉన్నాడు. ఆయనకు 19 శాతం ఓట్లు రావడం విశేషం. ఆ తర్వాత ప్రేరణ మూడో స్థానంలో ఉంది. ఆమెకి 15 శాతం ఓట్లు పోల్‌ అయ్యాయి. మిగిలిన కంటెస్టెంట్లు ప్రమాదంలో ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా విష్ణు ప్రియా, హరితేజ చాలా డేంజర్‌లో ఉన్నారు.

వీరిద్దరికి కేవలం 8శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. పృథ్వీరాజ 12శాతం, యష్మి 10 శాతం ఓట్లతో కాస్త సేఫ్‌లో ఉంది. కానీ ప్రమాదం అంతా విష్ణుప్రియా, హరితేజలకే ఉంది. వీరి ఓట్లు మెరుగుపడకపోతే ఈ వారం ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉంది. 
 

ఇందులో నాగ్‌ ఫేవరేట్‌ విష్ణు ప్రియా కూడా ఉండటం ఆశ్చర్యంగా మారింది. హరితేజ ఇటీవల కాస్త డల్‌గానే ఉంది. విష్ణు ప్రియా కూడా పైకి హడావుడి తప్ప టాస్క్ ల్లో, గేమ్‌లో అంతగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. వీకెండ్‌లో మాత్రం నాగ్‌ ఆమెని బాగా లేపుతున్నారు. అదే సమయంలో ఆమె కూడా ఓవర్‌ యాక్టింగ్‌ చేస్తున్నట్టుగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆడియెన్స్  ఆమెకి ఓట్లు వేయలేదని అర్థమవుతుంది.

ఈ ఓటింగ్‌ ఇలానే ఉంటే ఆమెకి రిస్క్ ఎక్కువగా ఉంది. ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఉంది. ఏ కాస్త మెరుగుపడినా హరితేజ ఎలిమినేషన్‌లోకి వెళ్లిపోతుంది. కానీ లేటెస్ట్ ఓటింగ్‌ ప్రక్రియని బట్టి చూస్తే, హరితేజ, విష్ణు ప్రియాలో ఒకరు ఎలిమినేషన్‌ కన్ఫమ్‌ అని అర్థమవుతుంది. ఓటింగ్‌కి ఇంకా మూడు రోజులు ఉంది. ఈ లోపు ఏదైనా మారోచ్చు. ఏం జరుగుతుందో చూడాలి.  

read more: సినిమా రిలీజ్‌ అయ్యాక సాంగ్‌ షూటింగ్‌, ఫలితం చూశాక కూడా అంటే బాలకృష్ణకే సాధ్యం, రాజమౌళి నుంచి ఇది ఊహించలేం

also read: వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన స్టార్ హీరోయిన్ అరుదైన ఫోటో.. చిన్నప్పుడు ఎంత చబ్బీగా ఉందో..
 

Latest Videos

click me!