లేటెస్ట్ సర్వే లో ఊహించని ఫలితాలు... టాలీవుడ్ టాప్ 10 హీరోలు వీరే! నెంబర్ వన్ ఎవరంటే?

Published : Apr 15, 2024, 07:37 PM IST

నెంబర్ గేమ్ ఎప్పుడూ ఆసక్తి రేపుతోంది. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరనే చర్చ చాలా కాలంగా ఉంది. ఈ క్రమంలో లేటెస్ట్ సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి.   

PREV
18
లేటెస్ట్ సర్వే లో ఊహించని ఫలితాలు... టాలీవుడ్ టాప్ 10 హీరోలు వీరే! నెంబర్ వన్ ఎవరంటే?
Tollywood top 10 Heroes

ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరంటే ఎన్టీఆర్... ఆ తర్వాత చిరంజీవి. ప్రస్తుతం అరడజనుకు పైగా బడా హీరోలు ఉన్నారు. వీరిలో నెంబర్ వన్ ఎవరు? టాప్ 5 ఎవరో తేలిపోయింది. ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అభిప్రాయాలు సేకరించి టాలీవుడ్ టాప్ 10 హీరోలు ఎవరో తేల్చింది.. 

 

28

బాహుబలి చిత్రాలతో ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్న ప్రభాస్ నెంబర్ వన్ హీరోగా ఈ సర్వే తేల్చింది. సలార్ మూవీతో ఫార్మ్ లోకి వచ్చిన ప్రభాస్ అగ్ర స్థానం దక్కించుకున్నాడు. 

38

ఇక రెండో స్థానం మహేష్ బాబు ఉన్నారు. ఆయన ఒక్క పాన్ ఇండియా మూవీ చేయనప్పటికీ పాపులారిటీలో సత్తా చాటుతున్నాడు. 
 

48

మరో పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన తదుపరి చిత్రం పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. 
 

58
NTR

ఇక నాలుగులో స్థానంలో ఎన్టీఆర్ ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్  మూవీతో దేశవ్యాప్తంగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. స్ట్రెయిట్ హిందీ చిత్రాలు చేస్తున్నారు. 
 

68

మరో ఆర్ ఆర్ ఆర్ హీరో రామ్ చరణ్ కి ఐదవ స్థానం దక్కింది. ఆయన టాప్ ఫైవ్ లో నిలిచాడు. నెక్స్ట్ గేమ్ ఛేంజర్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. 
 

78

రాజకీయంగా బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఆరో స్థానానికి పరిమితం అయ్యాడు. ఏడవ స్థానంలో నాని, ఎనిమిదవ స్థానంలో రవితేజ ఉన్నారు. 

88
Tollywood Top 10 Heroes

అనూహ్యంగా చిరంజీవి కంటే విజయ్ దేవరకొండ మెరుగైన ర్యాంక్ లో ఉన్నాడు. విజయ్ దేవరకొండకు తొమ్మిదవ స్థానం దక్కగా, పదవ స్థానంలో చిరంజీవి నిలిచారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories