డైరెక్టర్‌ కాకముందు రామ్‌గోపాల్‌ వర్మ ఏం పనిచేశాడో తెలుసా?.. ఆ క్యాసెట్లు అమ్ముకున్నాడా? కథ మామూలుగా లేదుగా

Published : Apr 15, 2024, 05:18 PM IST

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. `శివ`తో ఎంతటి సంచలనాలు సృష్టించాడో తెలిసిందే. కానీ ఆయన సినిమాల్లోకి రాకముందు ఏం పని చేశాడో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.   

PREV
18
డైరెక్టర్‌ కాకముందు రామ్‌గోపాల్‌ వర్మ ఏం పనిచేశాడో తెలుసా?.. ఆ క్యాసెట్లు అమ్ముకున్నాడా? కథ మామూలుగా లేదుగా

రామ్‌ గోపాల్‌ వర్మ.. అంటే ఇప్పుడు వివాదాస్పద దర్శకుడిగా మారారు. ఆయన వివాదాస్పద కామెంట్లు, బోల్డ్ స్టేట్‌మెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. `శివ` సినిమాతో సంచలనాలు సృష్టించిన ఆయన ఇప్పుడు దర్శకుడిగా సక్సెస్‌ అందుకోలేకపోతున్నాడు, దమ్మున్న సినిమాలు చేయలేకపోతున్నారు. డైరెక్టర్‌గా తన ఇమేజ్‌ని తానే డ్యామేజ్‌ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ అదే చేస్తున్నారు. ట్విట్టర్‌లో సెటైరికల్‌ పోస్ట్ లతో వార్తల్లో నిలుస్తుంటారు. 
 

28

ఇదిలా ఉంటే ఆర్జీవీ.. `శివ` చిత్రంతో దర్శకుడిగా మారారు. వర్మని నమ్మి నాగార్జున అవకాశం ఇవ్వడంతో డైరెక్టర్‌ అయ్యాడు. `శివ` చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు. సినిమా ఇలా తీయాలనే బౌండరీలను, రూల్స్ ని బ్రేక్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. `శివ` ఒక ట్రెండ్‌ సెట్టర్‌ మూవీలా నిలిచింది. అందులో యాక్షన్‌, డైలాగ్‌ డెలివరీ, సౌండింగ్‌ స్పెషల్‌గా నిలిచి అందరి చేత వాహ్‌ అనిపించింది. అప్పట్లో ఈ మూవీ యూత్‌ని బాగా ప్రభావితం చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

38

నాగార్జున ఆఫర్ ఇవ్వకపోతే వర్మ అనే వ్యక్తి మనకు తెలిసేవాడు కాదు. అయితే ఈ సినిమా అవకాశం రావడం వెనుకాల ఏం జరిగింది? అంతకు ముందు వర్మ ఏం పని చేసేవాడు, ఎలా సినిమా తీయాలనుకున్నాడు, ఎవరెవరి వద్దకు వెళ్లాడు అనేది ఆసక్తికరం. ఆయా రహస్యాలను బయటపెట్టాడు ఆర్జీవీ. క్యాసెట్లు అమ్ముకున్నట్టు తెలిపారు. మరి ఆ విశేషాలను చూస్తే.. కాలేజీ రోజుల్లో తాను హాలీవుడ్‌ సినిమాలు చూసేవాడట. అవి తనని ఎంతో ప్రభావితం చేశాయట. అలా తాను దర్శకుడిగా మారాలని, అందులోనూ హార్రర్‌ సినిమాలు చేయాలనేది అప్పుడు ఆంబీషన్‌గా పెట్టుకున్నాడట. ఇంజనీరింగ్‌ అయిపోయాక తన తాత తాజ్‌ క్రిష్ణ హోటల్‌లో జాబ్‌ ఇప్పించాడట. నెలకు 800 శాలరీ. అవి ఏమాత్రం సరిపోవడం లేదు.  

48

ఆ సమయంలో రామోజీరావు సినిమాలు బాగా నిర్మిస్తున్నాడు. ఆయనకు దగ్గర కావాలని, ఆయన్ని కలవాలని చెప్పి, సెకండ్‌ వరల్డ్ వార్‌లో 30 లక్షల మంది చనిపోవడానికి దారితీసిన అంశాలపై ఓ ఆర్టికల్‌ రాశారట. అది రామోజీరావుకి చేరేలా చేశాడట. దీంతో ఆయన్ని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ దొరికింది. దీంతో దర్శకత్వం చేయాలనే ఆలోచనని చెప్పాడట. అనుభవం లేకపోవడంతో కాలమిస్ట్ గా అవకాశం ఇస్తానుగానీ, దర్శకుడిగా ఎలా ఛాన్స్ ఇస్తాను అని చెప్పాడట రామోజీరావు. 

58

దీంతో ఇక లాభం లేదని భావించి విదేశాలకు వెళ్లిపోవాలని డిసైజ్‌ అయ్యాడట వర్మ. నైజీరియాలో జాబ్‌ చేస్తే నెలకు నాలుగు వేలు వస్తాయని ఫ్రెండ్‌ ద్వారా అక్కడికి వెళ్లేందుకు ప్రాసెస్‌ చేస్తున్నాడు. ఈక్రమంలో సినిమా వాళ్లు కలిశారు. ఓ చోట సినిమాల వీడియో క్యాసెట్ల షాప్‌ని చూశాడట. ఆ సమయంలో మనం ఎందుకు ఈ క్యాసెట్లు పెట్టకూడదు అని నిర్ణయించుకున్నాడట. మరో మూడు రోజుల్లో నైజీరియా వెళ్లాల్సి ఉండగా అప్పుడే డ్రాప్‌ అయ్యాడట. అప్పటికే వర్మకి పెళ్లైంది. లవ్‌ మ్యారేజ్‌. ఇంటర్‌కాస్ట్ అమ్మాయి. ఆమె తన నిర్ణయాన్ని వ్యతిరేకించిందట. పెద్ద గొడవ. ఎప్పుడు సినిమా సినిమా అంటున్నాడని,తనకు ఇవన్నీ నచ్చేవి కావట. అయినా క్యాసెట్ల షాప్‌ పెట్టాలని నిర్ణయించుకున్నాడు వర్మ. 
 

68

వర్మ తండ్రి అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. తాను రిటైర్‌మెంట్‌ అయ్యే సమయంలో తన ఫ్రెండ్‌ ఒకరు అమీర్‌ పేటలో ఏదైనా షాప్‌ పెట్టుకోమని ఫ్రీగా ఇచ్చాడట. దాంట్లో జ్యూస్‌ షాప్‌ పెట్టాలనుకున్నారట, వాళ్ల నాన్నా. దీంతో తాను బ్రతిమాలి అందులో వీడియో క్యాసెట్ల షాప్‌ పెట్టాలనుకున్నాడు వర్మ. అందుకోసం హైదరాబాద్‌లోని షాప్‌లు అన్నీ తిరిగాడు, ఫ్రెండ్స్ వాళ్లని వీళ్లని అడిగి ఓ 20వేలు అప్పుగా తెచ్చి సినిమాల వీడియో క్యాసెట్ల షాప్‌ పెట్టాడు. అందులో ఒకడు డూబ్లికేట్‌ క్యాసెట్లు ఇచ్చి మోసం చేశాడట. పదివేలు వేస్ట్ అయ్యాయి. మిగిలిన డబ్బుతో రెండు వందల సినిమాల వీడియో క్యాసెట్లతో షాప్‌ పెట్టాడట. 
 

78

ఆ షాప్‌ పెట్టడం లక్ష్యం.. తనకు తెలిసిన ఇరవై మంది ఉన్నారు, వాళ్లు రెగ్యూలర్‌గా తీసుకుంటారు. రోజుకి రెండు వందలు వచ్చినా చాలు అనుకున్నాడట. కానీ వాళ్లు ఎవరూ ఆ క్యాసెట్లు కొనడానికి రాలేదట. కానీ అనూహ్యంగా రోజుకి వంద క్యాసెట్లు అమ్ముడు పోయేవట. అలా నెలకు 20-25వేలు వచ్చేవట. ఈ క్రమంలో తన షాప్‌కి సినిమా వాళ్లు రావడం ప్రారంభమైంది. నాగార్జున బామ్మర్ది సురేంద్ర అని తనకు షాప్‌కి వచ్చేవాడట. సురేష్‌ బాబు వద్దకి కూడా వెళ్లాడట. అక్కడ వర్కౌట్ కాలేదు. సురేంద్ర ద్వారా అక్కినేని వెంకట్‌ని కలిశాడట. ఆయన ద్వారా నాగార్జున దగ్గరికి వెళ్లాలని, అలా నాగార్జునతో `శివ` సినిమా సెట్‌ అయ్యిందన్నారు వర్మ. 
 

88

రామ్‌గోపాల్‌ వర్మ.. `శివ` తర్వాత `క్షణం క్షణం`, `అంతం`, `గాయం`, `గోవింద గోవింద`, `రంగీలా`, `దెయ్యం`, `అనగనగా ఒక రోజు`, `దావూడ్‌`, `సత్య`, `కంపెనీ`, `బూత్‌`, `సర్కార్‌ రాజ్‌`, `కాంట్రాక్ట్`, `అగాయత్‌`, `రాన్‌`, `రక్త చరిత్ర`, `డిపార్ట్మెంట్‌` వంటి భారీ సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. `ఐస్‌ క్రీమ్‌` తర్వాత నుంచి ఆయన దర్శకుడిగా పడిపోతూ వస్తున్నారు. చివరగా ఆయన `వ్యూహం` సినిమా చేశాడు. ఇది ఆడలేదు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories