చరణ్‌ సేఫ్‌.. మహేష్‌, బన్నీ, ఎన్టీఆర్‌లకు ఊహించని దెబ్బ, ఇండియా నెంబర్‌ వన్‌ స్టార్‌ అతనే

Published : May 21, 2025, 05:22 PM IST

ఓర్మాక్స్ మీడియా తాజాగా ఏప్రిల్‌ నెలకు సంబంధించిన టాప్‌ 10 ఇండియా మోస్ట్ పాపులర్‌ స్టార్స్ జాబితాని విడుదల చేసింది. ఇందులో మహేష్‌, బన్నీ, తారక్‌లకు పెద్ద దెబ్బ పడింది. 

PREV
15
ఓర్మాక్స్ మీడియా టాప్‌ 10 ఇండియా మోస్ట్ పాపులర్‌ స్టార్స్

ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల  ఇండియా వైడ్‌గా ఏ స్టార్‌ హీరో క్రేజ్‌ ఎలా ఉంది? ఏ హీరో గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. వారి సినిమాల సందడి ఎలా ఉంది? ఇలా అనేక విషయాలను పరిగణలోకి తీసుకుని టాప్‌ 10 ఇండియన్‌ మోస్ట్ పాపులర్‌ స్టార్స్ జాబితాని విడుదల చేస్తుంది. 

ఓర్మాక్స్ మీడియా తాజాగా ఏప్రిల్‌ నెలకు సంబంధించిన జాబితాని విడుదల చేసింది. ఇండియాలో మోస్ట్ పాపులర్‌ టాప్‌ 10 స్టార్ హీరోల లిస్ట్ ని ప్రకటించింది. ఇందులో  రామ్‌ చరణ్‌ సేఫ్‌లో ఉన్నారు. కానీ మహేష్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లకు గట్టి దెబ్బ పడింది. వీరు తమ గత నెలస్థానాలను కోల్పోయారు.

25
నెంబర్‌ వన్‌ స్థానంలో ప్రభాస్‌, నాల్గో స్థానంలో అల్లు అర్జున్‌

ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన టాప్‌ 10 మోస్ట్ పాపులర్‌ ఇండియన్ స్టార్స్ లో నెంబర్‌ వన్‌ స్థానంలో ప్రభాస్‌ నిలిచారు. గత కొన్ని నెలలుగా ఆయన అదే స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాలు మారుతున్నాయి కానీ, ఆయన్ని టచ్‌ చేసే వాళ్లే లేరు. ఆ మధ్య బన్నీ రెండో స్థానానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన డౌన్‌ అయ్యారు. మార్చిలో మూడో స్థానంలో ఉన్న బన్నీ, ఏప్రిల్‌లో నాల్గో స్థానానికి పడిపోయారు.

35
ఆరో స్థానంలో మహేష్‌, పదో స్థానానికి పడిపోయిన తారక్‌

ఇక మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌లకు కూడా గట్టి దెబ్బ పడింది. మార్చిలో ఐదో స్థానంలో ఉన్న మహేష్‌ బాబు, ఏప్రిల్‌లో ఆరో స్థానానికి పడిపోయారు. మార్చిలో ఏడో స్థానంలో ఉన్న తారక్‌ ఇప్పుడు ఏప్రిల్‌లో పదో స్థానానికి పడిపోవడం గమనార్హం.

45
ఒక స్థానం మెరుగుపడ్డ రామ్‌ చరణ్‌

 ఇందులో సేఫ్‌గా ఉన్నది ఎవరు అంటే రామ్‌ చరణ్‌. మార్చిలో ఆయన ఎనిమిదో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఏడో స్థానానికి ఎగబాకారు. తెలుగు హీరోల్లో ప్రభాస్‌ తర్వాత సేఫ్‌లో ఉన్నది చరణ్‌ అనే చెప్పాలి.

55
విజయ్‌, అజిత్‌, షారూఖ్‌, సల్మాన్‌, అక్షయ్‌ల స్థానాలు ఇవే

ఇక మిగిలిన హీరోల విషయానికి వస్తే రెండో స్థానంలో కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ నిలిచారు. మూడో స్థానంలో బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ నిలవడం విశేషం. ఐదో స్థానంలో అజిత్‌, ఎనిమిదో స్థానంలో సల్మాన్‌ ఖాన్‌, తొమ్మిదో స్థానంలో అక్షయ్‌ కుమార్‌ నిలవడం విశేషం. కోలీవుడ్‌ నుంచి ఇద్దరు, బాలీవుడ్‌ నుంచి ముగ్గురు ఈ టాప్‌ 10 ఇండియా మోస్ట్ పాపులర్‌ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించారు. తెలుగు నుంచి ఐదుగురు హీరోలు నిలవడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories