ఫారెన్ నుంచి వచ్చాను కదా, దానికి ఒప్పేసుకుంటానని అనుకున్నారు.. కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ కామెంట్స్

Published : May 23, 2025, 05:18 PM IST

బ్రిటిష్ సింగర్, నటి సోఫీ చౌదరి బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌ అనుభవం ఎదుర్కొన్నట్లు తెలిపింది. అవకాశాల కోసం నిర్మాణ సంస్థల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు రాజీ అనే మాట ఉపయోగించేవారని సోఫీ పేర్కొంది. 

PREV
19
కాస్టింగ్ కౌచ్‌ అనుభవం

బ్రిటిష్ సింగర్, నటి సోఫీ చౌదరి బాలీవుడ్‌లో స్థిరపడ్డారు. కానీ ఆమె ప్రయాణం అంత సులభం జరగలేదు. ప్రారంభంలో ఆమె రాజీ, కమిట్మెంట్ లాంటి మాటలు ఎదుర్కొన్నారట.

29
సోఫీ చౌదరి చిత్రాలు

సోఫీ చౌదరి 'షాదీ నెంబర్ 1', 'ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్', 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దొబారా' వంటి సినిమాల్లో నటించారు.

39
అవకాశం కోసం వెళితే..

సోఫీ చౌదరి ఇటీవల కాస్టింగ్ కౌచ్ అనుభవాలను వెల్లడించారు. ఒక పాత్రలో నటించే అవకాశం వచ్చింది. కానీ వాళ్ళు రాజీ పడడం నీకు ఓకేనా అని అడిగారు. మొదట అర్థం కాకపోయినా ఆ తర్వాత వారి ఉద్దేశం అర్థం చేసుకుని దూరంగా వచ్చేశాను అని సోఫీ తెలిపారు. 

49
గాయనిగా ఎంట్రీ

నేను ముందుగా గాయనిగా వచ్చాను. నాకు ఇప్పటికే 2-3 హిట్ ఆల్బమ్‌లు ఉన్నాయి. నటనలో ప్రయత్నించాలనుకున్నాను. అనేక ప్రొడక్షన్ హౌస్‌ల చుట్టూ తిరిగాను.

59
వింతగా ప్రవర్తించేవారు

అవకాశాల కోసం వెళ్ళినప్పుడు వారు పరోక్షంగా, అసభ్యంగా మాట్లాడే విషయాలు మా అమ్మకు అర్థం కాలేదు. బాలీవుడ్‌కు వచ్చిన కొత్తల్లో నాతో వింతగా ప్రవర్తించేవారు. 

69
నాతో ఓకె చెప్పించాలని..

'అడ్జస్ట్ కావాలి, రాజీ పడాలి' అనేవారు. వారి ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు. వాళ్ళ మాటలు అర్థం కాకపోవడంతో మా అమ్మ.. మా అమ్మాయి కష్టపడి పనిచేస్తుంది అని చెప్పేది. ఎలాగైనా నాతో ఓకె చెప్పించాలని ప్రయత్నించేవారు.

79
ఫారెన్ నుంచి వచ్చిన అమ్మాయిని

నేను ఫారెన్ నుంచి వచ్చిన అమ్మాయిని. కాబట్టి నేను సులభంగా అలాంటి విషయాలకు ఓకె చెబుతానని వారు భావించేవారు. నాతో అసభ్యంగా ప్రవర్తించినప్పటికీ నేను పట్టించుకోను అని అనుకునేవారు.   

89
అన్ని విషయాలు తెలుసుకోవాలి

పరోక్షంగా చాలా మాటలు మాట్లాడేవారు. మీరు మా నటి. కాబట్టి మీ గురించి నేను దగ్గరగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. మీతో సమయం గడపాలి అని అసభ్యంగా చెప్పేవారు. 

99
ఎలాంటి అవకాశం ఇవ్వరు

ఆ తర్వాత నెమ్మదిగా వారి ఉద్దేశం నాకు అర్థం అయింది. వారు నాకు ఎలాంటి అవకాశం ఇవ్వరు. దాని పేరు చెప్పి నన్ను లైంగికంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని అర్థం అయింది. అలాంటి వారికి దూరంగా ఉండడం ప్రారంభించినట్లు సోఫీ చౌదరి పేర్కొంది.

Read more Photos on
click me!

Recommended Stories