Sirivennela: నేను సాగిలపడి నమస్కరించే వ్యక్తి ఆయన.. సిరివెన్నెలకు బన్నీ, ఎన్టీఆర్,పవన్, మహేష్ నివాళి

First Published Dec 1, 2021, 12:13 PM IST

అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం సిరివెన్నెల పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించారు. Allu Arjun, మహేష్ బాబు, బాలకృష్ణ, నాగార్జున లాంటి ప్రముఖులంతా సిరివెన్నెలకు నివాళులర్పించారు. 

తెలుగు పదాలతో మ్యాజిక్ చేసి శిఖరాగ్రానికి చేరుకున్న పాటల రచయిత  Sirivennela Seetharama Sastry ఇక లేరు అంటే అందరికీ జీర్ణించుకోవడం కష్టంగా మారింది. మంగళవారం కిమ్స్ లో చికిత్స పొందుతూ సిరివెన్నెల మృతి చెందిన సంగతి తెలిసిందే. తెలుగు సాహిత్యానికి ఇది చీకటి రోజు అంటూ దేశం నలువైపుల నుంచి సిరివెన్నెల మృతికి సంతాపాలు అందుతున్నాయి. సిరివెన్నెలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ టాలీవుడ్ ప్రముఖులంతా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. 

అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం సిరివెన్నెల పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించారు. Allu Arjun, మహేష్ బాబు, బాలకృష్ణ, నాగార్జున లాంటి ప్రముఖులంతా సిరివెన్నెలకు నివాళులర్పించారు. సిరివెన్నెల పార్థివదేహం వద్దే త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఉన్నారు. 

సిరివెన్నెలకు నివాళి అర్పించిన అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. నా ఫ్యామిలీ తర్వాత నేను సాగిలపడి నమస్కరించే వ్యక్తి సిరివెన్నెల గారు అని బన్నీ తెలిపారు. నాకు తెలుగు సాహిత్యంపై అంత పట్టు లేదు. కానీ ఆయన పాటలతో సాహిత్యంపై గౌరవం పెరిగింది అని బన్నీ చెప్పుకొచ్చాడు. 

ఇక బాలయ్య ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక నాగార్జున కూడా సిరివెన్నెలకు నివాళి అర్పించారు. సిరివెన్నెల తన చిత్రాలకు రాసిన 'తెలుసా మనసా', ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా లాంటి పాటలని నాగార్జున గుర్తు చేసుకున్నారు. 

ఇక Mahesh babu చెమర్చిన కళ్ళతో ఎమోషనల్ అవుతూ సిరివెన్నెలకు నివాళి అర్పించారు.  టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా సిరివెన్నెల భౌతిక కాయానికి నివాళి అర్పించేందుకు వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సిరివెన్నెల అంతిమ యాత్ర మొదలవుతుంది. మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 

సిరివెన్నెల నివాళులర్పించిన అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలుగు జాతి ఉన్నంతకాలం, తెలుగు భాష ఉన్నంత కాలం సిరివెన్నెల అక్షరాలు చిరస్మరణీయంగా ఉంటాయని అన్నారు. 

పవన్ కళ్యాణ్ సిరివెన్నెలకు నివాళి అర్పించారు. అన్నయ్య 'రుద్రవీణ' చిత్ర సమయం నుంచి వారితో నాకు పరిచయం ఉంది. జానీ చిత్ర పాటల కోసం స్వయంగా ఆయనతో కలసి పనిచేశాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. సిరివెన్నెల గారు ఇంకొంత కాలం ఉండాల్సింది. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి అని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీతో కలసి సిరివెన్నెలకు నివాళి అర్పించారు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం సిరివెన్నెల 'దోస్తీ' సాంగ్ రచించారు.  Also Read: Sirivennela: 3 సెకండ్లలోనే ఆ పాట, పొరపాటున స్వర్గానికి వెళితే.. సిరివెన్నెలపై ఆర్జీవీ కామెంట్స్

click me!