జన సైనికురాలికి బిగ్ బాస్ షోలో నో ఛాన్స్... చాలా బాధగా ఉందంటూ ఆవేదన చెందిన తెలుగు బ్యూటీ!

First Published | Aug 13, 2024, 8:04 PM IST


బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లడం అంత సులభం కాదు. అయితే ఓ తెలుగు అమ్మాయికి అవకాశం చేతి వరకు వచ్చి చివరి నిమిషంలో చేయిజారినట్లు తెలుస్తుంది. 
 

Bigg Boss Telugu


బిగ్ బాస్ తెలుగు 8 లాంచింగ్ కి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. కంటెస్టెంట్స్ ఎంపిక చివరి దశకు చేరింది. కొందరు కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి అయ్యింది. మెయిల్స్ పంపిన సెలెబ్స్ కి ఇంటర్వ్యూలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. తెలుగు అమ్మాయి ఛాన్స్ కోల్పోయిందట. 
 


బిగ్ బాస్ ఎంపిక కొంచెం కఠినంగానే ఉంటుంది. అదే సమయంలో బెస్ట్ కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తారు. ప్రతి సీజన్ కి 60 మందిని ఇంటర్వ్యూ చేస్తారని సమాచారం. వారిలో ఎంపిక చేసేది 19 నుండి 21 మందిని మాత్రమే. పలువురు బిగ్ బాస్ షోకి వెళ్లాలని ఆశపడతారు. వారిలో కొందరికే ఛాన్స్ దక్కుతుంది. 
 


తెలుగు అమ్మాయి, జన సైనికురాలు రేఖా భోజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటూ వార్తలు వచ్చాయి. రేఖా భోజ్ సోషల్ మీడియా జనాలకు సుపరిచితమే. ఆమెను పలువురు ఫాలో అవుతారు. అలాగే ఆమె సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీకి ప్రచారం చేస్తుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఆమెకు అమిత ఇష్టం. 

 

రేఖా భోజ్ ఎంపిక అయ్యారని కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అయితే తాను ఎంపిక కాలేదని, తనని రిజెక్ట్ చేశారని ఆమె చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా వేదికగా రేఖా భోజ్ పరోక్షంగా హింట్ ఇచ్చింది. దాంతో జనసేన అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో ఏం రాశారో చూద్దాం. 
 

Bigg Boss Telugu 8

అధికారికారికంగా ఇప్పుడే తెలిసింది. ఈసారి కాదని. చాలా బాధగా ఉంది. కానీ ఇదే ఫైనల్ కాదు కదా. ఈ బాధ నుండి బయటపడే శక్తిని ఇవ్వు ఈశ్వరా! ఒక నెల వరకు సోషల్ మీడియాకు సెలవు అని ఆమె రాసుకొచ్చారు. ఆమె పోస్ట్ వైరల్ అవుతుంది. 

Latest Videos

click me!