టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లిస్ట్, ప్రభాస్ సినిమాలు ఏ ప్లేస్ లో ఉన్నాయి?

First Published | Oct 23, 2024, 8:35 AM IST

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ప్రభాస్, రాజమౌళి చిత్రాలు హవా కొనసాగిస్తున్నాయి. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 AD వంటి చిత్రాలు భారీ కలెక్షన్లతో టాప్ గ్రాసర్స్ గా నిలిచాయి.


ఈ యేడు టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలతో టాప్ గ్రాస్ లతో దూసుకుపోతోంది.  ఓ రకంగా టాలీవుడ్ కు పోయిన కళ తిరిగి వచ్చింది. భాక్సాఫీస్ దగ్గర వరస పెట్టి పెద్ద సినిమాలు హవా చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగ ప్రభాస్ కల్కి, ఎన్టీఆర్ దేవర సినిమాలు ఈ సంవత్సరం రికార్డ్ లు క్రియేట్ చేసాయి.

ఈ క్రమంలో రాబోయో పుష్ప 2, గేమ్ ఛేంజర్ మీదే అందరి దృష్టీ ఉంది. ఈ రెండు సినిమాలు కొత్త రికార్డ్ లు నెలకొల్పుతాయని భాక్సాఫీస్ భావిస్తోంది. ఈ క్రమంలో ఓ సారి...భాక్సాఫీస్ దగ్గర టాప్ గ్రాసర్స్ గా రికార్డ్ చేసిన సినిమాలు లిస్ట్ చూస్తే రాజమౌళి, ప్రబాస్ ల హవానే కనిపిస్తుంది. ప్రభాస్ సినిమాలు ఎక్కువ శాతం ఈ లిస్ట్ లో ఉండటం గమనార్హం.


 #Baahubali2 

ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి2’ విడుదలయ్యి  రికార్డ్ లు క్రియేట్ చేసింది. 2017 ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదల అయ్యిన ఈ చిత్రం  తెలుగు సినిమా స్థాయిని పెంచింది.దేశ విదేశాల్లో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి.

ఈ సినిమా -1750 cr కోట్లు గ్రాస్ సంపాదించింది.‘బాహుబలి2’ కి జరిగిన థియేట్రికల్ బిజినెస్ రూ.350 కోట్లు. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 814.10 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే 1750 కోట్లను కొల్లగొట్టింది. మొత్తానికి ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లకు భారీగా రూ.464.10 కోట్ల లాభాలు దక్కినట్టు అయ్యింది. 


#RRRMovie 

  ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ''ఆర్.ఆర్.ఆర్'' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. మార్చి 25న థియేటర్లలో విడుదలైన ఈ ప్యాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమా ప్రపంచవ్యాప్తంగా త్రీడి తో కలిపి రూ. 1290 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. . ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ మరియు అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, ఆలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియా, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు.
 

#Kalki2898AD
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా మార్కెట్‌ రేంజ్‌ ఏంటో బాలీవుడ్‌కు చూపించాడు. కల్కి 2898 ఏడీ సినిమాతో బాక్సాఫీస్‌ రికార్డ్స్‌ కొల్లగొట్టాడు. జూన్ 27న విడుదలైన కల్కి..  మంచి కలెక్షన్స్ తో  థియేట్రికల్ రన్ కొనసాగింది. ఇండియా అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రాల జాబితాలో కల్కి చేరిపోయింది. భారత్‌లో గ్రాస్ కలెక్షన్ల పరంగా బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీని కల్కి 2898 ఏడీ దాటేసింది.  త్రీడి వెర్షన్ తో కలిపి కల్కి చిత్రం  1050 cr గ్రాస్ సంపాదించింది.


 #Salaar 
డైనోసర్ ప్రభాస్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ చిత్రం "సలార్: సీజ్ ఫైర్ - పార్ట్ 1" బాక్సాఫీస్ వద్ద తన హవాను ఓ రేంజిలో చూపించింది. సలార్ చిత్రానికి   రూ. 615 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సలార్ మూవీ 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల ర్యాంకింగ్ లో ఐదవ స్థానాన్ని సాధించింది.

ఇదిలా ఉంటే ప్రభాస్, శ్రతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన సలార్ మూవీ రూ. 270 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. వాటిలో ప్రభాస్ రెమ్యునరేషన్ సుమారు రూ. 100 కోట్లు అని టాక్ నడిచిన విషయం తెలిసిందే.
 

#Baahubali

బాహుబలితో ప్రభాస్‌ మొదటిసారి రూ.500 కోట్ల క్లబ్‌లోకి వచ్చాడు.భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టింది. తమిళనాడులో రెండు రోజుల్లో , బాలీవుడ్ లోనూ 'బాహుబలి' ప్రభంజనం  సాగింది. ఓవర్ సీస్ మార్కెట్ లోనూ 'బాహుబలి' రికార్డు బద్దలు కొట్టింది. ఈ చిత్రం గ్రాస్ 580 కోట్లు కావటం విశేషం.  

#Saaho 

ఈ సినిమా గమ్మత్తుగా తెలుగు కన్నా హిందీలో ‘సాహో’ కలెక్షన్ల కుమ్ముడు కొనసాగింది. ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్లింది.  టాక్ సంగతి పక్కన పెట్టేస్తే.. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అన్ని ఏరియా లనుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సంచలనం సృష్టించింది.

ప్రభాస్ కలెక్షన్స్ పవర్ ఏంటో ఈ సినిమా మరోసారి ప్రూవ్ అయ్యింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించింది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా ‘సాహో’ రూపొందింది. హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్, స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు. ప్రభాస్ కెరీర్‌లొనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు. శ్ర‌ద్ధా క‌పూర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. భారీ ఖర్చుతో యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం 420 కోట్లు గ్రాస్ సంపాదించి పెట్టింది. 

ఇక ఈ లిస్ట్ లో దేవర #Devara – 400 cr, పుష్ప  #Pushpa – 390 cr, హనుమాన్ #Hanuman – 300 cr,అలవైకుంఠపురములో  #AlaVaikunthapurramuloo – 260 cr గ్రాస్ లు ఉన్నాయి. ఇప్పుడు అందరి దృష్టీ పుష్ప 2, గేమ్ ఛేంజర్ గ్రాస్ లపై ఉంది. 
 

Latest Videos

click me!