నాగ మణికంఠ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడని రోజులు గడిచే కొద్దీ అర్థమైంది. హౌస్ మొత్తాన్ని నాగ మణికంఠ కన్ఫ్యూషన్ లో పడేశాడు. అతడి పట్ల ఎలా ప్రవర్తించాలో కంటెస్టెంట్స్ కి అర్థం కాని పరిస్థితి. ఒక దశలో నాగ మణికంఠను అందరూ టార్గెట్ చేశారు. అది వాళ్లకు మైనస్ అవుతుందని, అతడికి ప్లస్ అవుతుందనే సందేహం మరలా వారిలో కలిగింది.
నాగ మణికంఠ సింపతీ గేమ్ తనను టార్గెట్ చేస్తున్న కంటెస్టెంట్స్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందనే చర్చ హౌస్లో మొదలైంది. అంతగా నాగ మణికంఠ ఇతర కంటెస్టెంట్స్ మైండ్స్ ట్యూన్ చేశాడు. అదే సమయంలో అమ్మాయిలతో నాగ మణికంఠ ప్రవర్తన విమర్శలకు దారి తీసింది. నాగ మణికంఠ హగ్ చేసుకోవడం నాకు నచ్చలేదని యష్మి అసహనం ప్రదర్శించింది.