విష్ణు ప్రియకు హ్యాండ్ ఇచ్చిన పృధ్వీ.. కన్నడ బ్యాచ్ కుట్రకు బలైపోయిన విష్ణు.

First Published | Oct 23, 2024, 1:10 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో రోజుకో సరికొత్త వార్త వస్తోంది. ఇక తాజాగా అందిన బిగ్ బాస్ బిగ్ బ్రేకింగ్ ఏంటంటే....? విష్ణు ప్రియకు పెద్ద హ్యాండ్ ఇచ్చాడు.. పాపం విష్ణు ప్రియ పరిస్థితి ఏంటి..? 
 

బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బ్రేకింగ్.. విష్ణు ప్రియకు పెద్ద హ్యాండిచ్చేశాడు పృథ్విరాజ్.  నామినేషన్స్ లో ఈసారి వీరిద్దరిని టార్గెట్ చేయడంతో.. యష్మి పృధ్వీని హెచ్చరించింది. మరీ ఓవర్ అయిపోతుంది అంటూ విష్ణు ప్రియను విమర్శించింది. అయితే ఈ విషయంలో నీకు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అని యష్మి పృధ్వీని అడిగింది. అదేం లేదని.. నేనేమి తన దగ్గరకు వెళ్ళడంలేదని.. తానే నా దగ్గరకు వస్తుందంటూ.. పృధ్వీ తేల్చేశాడు.

 అంతే కాదు విష్ణు ప్రియను కూడా కూర్చోబెట్టి పృధ్వీ తేల్చేశాడు. నేను ముందే చెప్పాను కదా.. నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, నేను సింగిల్ అని.. మనం ఏమైనా ఓవర్ అవుతున్నామేమో చూసుకో.. నీకేం ఫీలింగ్స్ లేవు కాదా అని అడిగాడు. దాంతో విష్ణు ప్రియ అయిష్టంగానే.. అన్ క్లియర్ గా లేదు అదేం లేదు అని ఆన్సర్ చేసింది. కాని తరువాత ఓంటరిగా బాధపడుతున్న విష్ణును నబిల్ ఒదార్చాడు. 

వీళ్లిద్దరి మధ్య కన్నడ బ్యాచ్ చిచ్చు పెట్టారు. నామినేషన్స్ లో విష్ణు ప్రియ, పృధ్వీన్ హౌస్ మెట్స్ టార్గెట్ చేసి..మీరిద్దరు సింగిల్ గా ఎక్కడా కనిపిచడంలేదు.. ఆట కూడా సరిగ్గా ఆడటం లేదు అని చెప్పడంతో.. ఇక కన్నడ బ్యాచ్ అంతా అర్ధ రాత్రి మీటింగ్ పెట్టారు. యష్మీ, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ కలిసి మాట్లాడుకున్నారు. . నిఖిల్‌కి ప్రేరణ మసాజ్ చేస్తుండగా పృథ్వీతో యష్మీ సీరియస్ డిస్కషన్ పెట్టింది. 

పృథ్వీ ఒక ఫ్రెండ్‌గా చెబుతున్నా విను.. నాకే మిమ్మల్ని చూసి చూసి విసుగొచ్చింది.. ఏంటి వాడికి తను (విష్ణు) స్పేస్ ఇవ్వట్లేదు.. ఇద్దరూ స్పేస్‌యే తీసుకోవట్లేదు.. ప్రతిసారి ఎక్కడ చూసినా ఇద్దరు ఇద్దరే కనిపిస్తారు.. నాకే ఇరిటేషన్ వచ్చేసింది.. రేయ్ ఇది ఇండివీడ్యువల్ గేమ్.. నీకు ఏదైనా ఉంటే బయట చూసుకుందాం.. . డైరెక్ట్‌గా కొశ్చన్ అడుగుతా చెప్పు.. నీకు ఏదైనా ఫీలింగ్ ఉందా తనపై.." అని యష్మీ అడిగితే లేదు అంటూ పృథ్వీ బదులిచ్చాడు. 

అయితే తను జస్ట్ ఫ్రెండ్.. అంతేనా అని యష్మీ అంటే మళ్లీ అవును అన్నాడు. మరి ఎందుకు హౌస్‌లో ఉన్న మిగిలిన వాళ్లతో కాకుండా తనతో ఎందుకు క్లోజ్‌గా ఉంటావ్.. అంటూ యష్మీ అడిగింది. అలా ఏం లేదు తను వస్తే మాట్లాడతా.. నేను వెళ్లి మాట్లాడేది తక్కువే అంటూ పృథ్వీ అన్నాడు. 


ఇన్నిరోజులు వీరిమధ్య ఏదో ఉందిలే.. ఏదో ఉందిలే అనుకుంటున్న ఆడియన్స్ కు ఒక్క దెబ్బతోక్లారిటీ ఇచ్చేశాడు పృధ్వి రాజ్. తనపై కోటి ఆశు పెట్టుకున్న విష్ణు ప్రియ ప్రేమపై నీళ్లు చల్లాడు రాజ్. ఇక ఈ విషయాన్ని తట్టుకోలేకపోయింది విష్ణు. పైకి బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం బాగా ఇబ్బంది పడింది.  ప్రపంచంఅంతా తల్లకిందుకు అయినట్టుగా ఫీల్అయ్యింది విష్ణు ప్రియ. 

ఇక బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరిప్రేమకుపుల్ స్టాప్ పడటంతో.. కాస్త ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది అనే చెప్పాలి. అయితే విష్ణు ప్రియ నెక్ట్ స్టెప్ ఏలా వేస్తుంది. ఏం చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.ఇక ఈ వారం నామినేషన్ల పర్వం పూర్తి అయ్యింది. ప్రతీవారం లాగానే ఈసారి కూడా యుద్దవాతవారణ కనిపించింది. 

ఒకరిపై మరొకరు చేస్తున్న మాటల దాటికి బిగ్ బాస్ రణరంగంగామారింది. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి 8 వారం సబయటకు వెళ్ళిపోవడానికి విష్ణుప్రియ, పృధ్వి, నిఖిల్, ప్రేరణ, నయనిపావని, నామినేషన్స్ లో ఉన్నారు. హరితేజ్ ముందు నామినేషన్స్ లో ఉంది. కాని తన సూపర్ పవర్ ను ఉపయోగించి హరితేజను రక్షించాడుగౌతమ్. 

Latest Videos

click me!