టాలీవుడ్‌ టాప్ కమెడీయన్లు బ్రహ్మీ,అలీ, సునీల్‌, రాహుల్‌, ప్రియదర్శి, పోసాని, వెన్నెల పారితోషికాలు ఎంతో తెలుసా?

Published : May 14, 2021, 02:47 PM IST

టాలీవుడ్‌ టాప్‌ కమెడీయన్లు బ్రహ్మానందం, అలీ, వెన్నెల కిషోర్‌, సునీల్‌, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, పృథ్వీ, పోసాని, శ్రీనివాస్‌రెడ్డి, సప్తగిరి ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసా.. వింటే ఆశ్చర్యపోవాల్సిందే. 

PREV
113
టాలీవుడ్‌ టాప్ కమెడీయన్లు బ్రహ్మీ,అలీ, సునీల్‌, రాహుల్‌, ప్రియదర్శి, పోసాని, వెన్నెల పారితోషికాలు ఎంతో తెలుసా?
చిత్ర పరిశ్రమలో పారితోషికాలే ప్రధాన చర్చగా మారుతుంది. హీరోల రెమ్యూనరేషన్స్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతుంది. ఆ హీరో ఇన్ని కోట్లు,ఈ హీరో అన్ని కోట్లు, ఈ హీరో ఇంత పెంచాడనేది బాగా డిస్కషన్‌గా ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ల పారితోషికాలు వైరల్‌గా మారుతుంటాయి. ఓ హీరోయిన్‌ కొంచెం పెంచినా ఓ ఇంత పెంచిందంటుంటారు. కానీ కమెడీయన్ల పారితోషికాలు ఎప్పుడూ చర్చకు రావు.

213
ఓ సినిమాని బోర్‌ లేకుండా నడిపించడంలో హాస్య నటులదే కీలక పాత్ర. ఇంకా చెప్పాలంటే హీరో, కథ బోర్‌ కొట్టించినా, కమెడీయన్‌ ఎప్పుడూ బోర్‌ కొట్టించడు. ఆడియెన్స్ కి కావాల్సిన వినోదాన్ని తన పాత్ర పరిధి మేరకు అందిస్తూనే ఉంటారు. దర్శకుడు ఫ్రీడమ్‌ ఇవ్వాలే గాని రెచ్చిపోయి నవ్వులు పూయిస్తాడు హాస్యనటుడు. కానీ కమెడీయన్‌ ఎప్పుడైనా కూరలో కరివేపాకు లాంటి వాడే. సినిమా హిట్‌ అయితే క్రెడిట్‌ మొత్తం హీరో తన్నుకుపోతాడు. సినిమా అంటేనే వినోదం. ఆ వినోదం కమెడీయన్‌ నుంచే వస్తున్నప్పుడు ఆ కమెడీయెన్‌కి విలువెక్కువ. కానీ చాలా సందర్భాల్లో కమెడీయన్‌కి ఆ గుర్తింపు దక్కదు. వారి పారితోషికాలు కూడా తక్కువే ఉంటాయి. హీరో, హీరోయిన్‌లతో పోల్చితే వీరికి కేవలం లక్షల్లోనే ఉంటుంది. మన టాప్‌ కమెడీయన్లు ఎంత రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారో ఓ లుక్కేద్దాం.

313
కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం ఒకప్పుడు టాప్‌ కమేడియన్‌గా వెలిగారు. నేటితరం హాస్య నటులు దూసుకొస్తున్న నేపథ్యంలో ఆయనకు అవకాశాలు తగ్గాయి. బట్‌ ఆయన ఒక్క రోజుకి దాదాపు రూ. 6 లక్షలు పారితోషికంగా తీసుకుంటున్నారు. గతంలో అది ఇంకా ఎక్కువే.

413
సునీల్‌ హీరోగా రాణించారు. హీరోగా సక్సెస్‌ అయ్యారు. ఇక స్టార్‌ హీరో రేంజ్‌కి వెళ్లిపోతాడునుకునే సమయంలో పరాజయాలు వెంటాడాయి. దీంతో మళ్లీ హాస్యనటుడిగా చేస్తున్నారు. అవకాశం వస్తే హీరోగా నటిస్తూనే కమెడీయన్‌ పాత్రలు పోషిస్తున్నారు. కాకపోతే చాలా సెలక్లీవ్‌గా చేస్తున్నారు. సునీల్‌ రోజుకి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు తీసుకుంటున్నారని టాక్‌.

513
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అసలు సినిమాల్లోనే పెరిగిన అలీ టాప్‌ మోస్ట్ కమెడీయన్‌. హీరోలకు ఫ్రెండ్‌గా, హాస్యాన్ని పండిస్తూ అలరిస్తుంటారు. ఆయన ప్రస్తుతం ఒక్క రోజుకి మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల వరకు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారట.

613
సీనియర్‌ కమెడీయన్లలో పోసాని కృష్ణమురళి ఒకరు. ఆయన కమెడీ స్టయిలే వేరు. సినిమాల్లో మెయిన్‌ రోల్స్ చేస్తూనే నవ్వులు పూయిస్తున్నారు పోసాని. అందుకే ఆయనకు డిమాండ్‌ ఎక్కువ. ఆయన దాదాపు మూడు లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్టు టాక్‌.

713
ప్రస్తుతం టాప్‌ మోస్ట్ కమెడీయన్‌గా రాణిస్తున్న వెన్నెల కిశోర్‌. యంగ్‌ హీరోలకు, యంగ్‌ సూపర్‌ స్టార్స్ కి వెన్నెల కిషోర్‌ బెస్ట్ ఆప్షన్‌. ఆయన రోజుకి మూడు లక్షలు తీసుకుంటున్నారని టాలీవుడ్‌ టాక్‌.

813
హీరో, హాస్యనటుడిగా రాణిస్తున్నారు సప్తగిరి. ఆయన కమెడీయన్‌గా రెండు లక్షల రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారట. హీరోగా కోటీకిపైనే ఉంటుందని టాక్‌.

913
ఇప్పటి తరం కమెడీయన్లలో రాహుల్‌ రామకృష్ణ ఒకరు. తెలంగాణ యాసతోనే కామెడీ పుట్టిస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నారు. కామెడీనే కాదు, నటనతోనూ ఆకట్టుకుంటున్నారు. సహజమైన కమెడీయన్‌గా మెప్పిస్తున్న రాహుల్‌ రామకృష్ణ రోజుకి రెండు లక్షలు తీసుకుంటున్నారట.

1013
`పెళ్లిచూపులు`తో పాపులర్‌ అయ్యారు ప్రియదర్శి. ఆ తర్వాత సహజమైన కామెడీతో మెప్పిస్తున్నారు. `మల్లేశం` చిత్రంలో, `మెయిల్‌` సినిమాలో తనే మెయిన్‌ లీడ్‌ చేశాడు. ఇక `జాతిరత్నాలు`లోనూ ముగ్గురిలో ఒకడిగా ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి రోజుకి రెండు లక్షలు డిమాండ్‌ చేస్తున్నారట.

1113
శ్రీనివాస్‌ రెడ్డి కూడా ఒకటి రెండు సినిమాల్లో హీరోగా రాణించే ప్రయత్నం చేశారు. కానీ హీరోకి ఫ్రెండ్‌గా, హాస్య పాత్రల్లో మెరుస్తూ అలరిస్తున్నారు. ఆయన కూడా రోజుకి రెండు లక్షలు తీసుకుంటున్నారని సమాచారం.

1213
30 ఇయర్స్ పృథ్వీగా పాపులర్‌ అయిన పృథ్వీ ఈ మధ్య ఛాన్స్ లు తగ్గాయి. వివాదాలతో ఆయన కాస్త వెనకడుగు వేశారు. అయినా అడపాదడపా అవకాశాలు అందుకుంటున్నారు. రోజుకి ఆయన రెండు లక్షలు డిమాండ్‌ చేస్తున్నారట.

1313
వీరితోపాటు రఘుబాబు, కృష్ణ భగవాన్‌, ప్రదీప్‌, షకలక శంకర్‌, హర్ష, సత్య, ప్రభాస్‌ శ్రీను వంటి వారు ఒక్క రోజుకి లక్ష నుంచి రెండు లక్షల వరకు సినిమా రేంజ్‌ మేరకు, పాత్ర పరిధి మేరకు పారితోషికం అందుకుంటున్నారట.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories