సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ షెడ్యూల్ ఫిక్స్.. ఏ హీరోలు ఎక్కడెక్క షూటింగ్ చేసుకుంటున్నారంటే.?

Published : Mar 05, 2022, 11:52 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరి షూటింగ్స్ లో వారు బిజీ అయిపోయారు. కొంత మంది లోకల్ గా షూటింగ్స్ చేసుకుంటుంటే.. మరికొంత మంది మాత్రం అవుట్ డోర్ లో హడావిడి చేస్తున్నారు. 

PREV
19
సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ షెడ్యూల్ ఫిక్స్.. ఏ హీరోలు ఎక్కడెక్క షూటింగ్ చేసుకుంటున్నారంటే.?

స్టార్ హీరోలు.. చిన్న హీరోలు ఎవరికి వారు బిజీ అయిపోయారు. తమ సినిమాలు త్వరగా కంప్లీట్ చేసుకుని రిలీజ్ డేట్స్ ఇచ్చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఎవరి లొకేషన్స్ లో వారు సందడి చేస్తున్నారు. మరి ఏ హీరో.. ఎక్కడ షూటింగ్ చేసుకుంటున్నాడో చూడ్డాం. మరో వైపు మెగాస్టార్ సినిమాలో సల్మాన్ ఖాన్ షెడ్యూల్ కన్ ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది. 

29

మొన్నటి దాకా మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గోన్నారు. ఇక నెక్ట్స్ గాడ్ ఫాదర్ సెట్ లో జాయిన్ కాబోతున్నాడు మెగాస్టార్. ఈ షెడ్యూల్ కోసం సల్మాన్ ఖాన్ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. 13న కాని 14న కాని షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా కోకాపేటలో జరుగుతుందని అంటున్నారు. 

39

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె జంటగా నాగ్ అశ్వీన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కే చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. మొన్నటి వరకూ ఈషెడ్యూల్ లో పాల్గొన్నారు బిగ్ బీ. ఇప్పుడు ఈమూవీకి సంబంధించిన మేజర్ సీన్స్ షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

49

మరో వైపు సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్  కూడా స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ లోని పఠాన్ చెరు పరిసర ప్రాంతాల్లో ఈమూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో సూపర్ స్టార్ లేకుండా సీన్స్ చేస్తున్నట్టు సమాచారం. 
 

59

మరో వైపు ఆంథ్రాలో హడావిడ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్  నటిస్తున్న పాన్ ఇండియా మూవీ సినిమా షూటింగ్ సామర్ల కోట లో జరుగుతోంది. పబ్లిక్ సీన్స్ ను తెరకెక్కించే పనిలో ఉందట టీమ్. 

69

అటు కింగ్ నాగార్జున కూడా తన షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో నాగ్ హీరోగా రూపొందుతున్న ఘోస్ట్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని  అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది

79

వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్న హీరో రవితేజ. మాస్ మహారాజ్ తో పాటు యంగ్ స్టార్  సుశాంత్ నటిస్తున్న సినిమా రావణాసుర. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని మాదాపూర్ లో జరుగుతుంది

89

మరో వైపు గోదావరిఖనిలో సందడి చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. తాను చేస్తున్న దసరా సినిమా షూటింగ్ కొన్ని రోజుల నుంచీ  గోదావరి ఖని పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఎండను కూడా లేక్క చేయకుండా సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడట నేచురల్ స్టార్. 

99

అటు డిఫరెంట్ సినిమాల దర్శకుడు తేజ.. అభిరామ్ దగ్గుబాటి నీ హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న సినిమా షూటింగ్ కూడా ఆంథ్రాలోనే జరుగుతుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్  హడావిడి స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories