ఊహించుకుంటేనే మతిపోతోంది.. ఎన్టీఆర్, చరణ్, మహేష్, పవన్.. త్వరగా ప్లీజ్ అంటున్న ఫాన్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 05, 2022, 11:15 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ కాంబినేషన్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు చూద్దాం.   

PREV
18
ఊహించుకుంటేనే మతిపోతోంది.. ఎన్టీఆర్, చరణ్, మహేష్, పవన్.. త్వరగా ప్లీజ్ అంటున్న ఫాన్స్

అల్లు అర్జున్ - మురుగదాస్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నాడు. ఇకపై బన్నీ నటించబోయే చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో బన్నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో అత్యంత ఆసక్తికరంగా మారింది మురుగదాస్ దర్శకత్వంలోని చిత్రం. బన్నీ, మురుగదాస్ కాంబినేషన్ లో సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. సందేశాత్మక చిత్రాలని తనదైన శైలితో స్టైలిష్ గా తెరకెక్కించి మాస్ ని కూడా మెప్పించగలరు మురుగదాస్. ఈ క్రేజీ కాంబో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 

28

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రానికి ఆల్రెడీ ప్రకటన వచ్చేసింది. ఈ కాంబినేషన్ ఎంత త్వరగా ప్రారంభం అవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కెజిఎఫ్ లో యష్ ని ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేసిన విధానం ఊహించుకుంటుంటే.. ఎన్టీఆర్ ని ఇంకెంత పవర్ ఫుల్ గా, మాస్ గా చూపిస్తాడో అని ఆసక్తి పెరిగిపోతోంది. 

 

38

రాంచరణ్ - శంకర్ :డైరెక్టర్ శంకర్ దర్శకత్వం గురించి చెప్పేదేముంది. అద్భుతమైన కథకు తన దర్శకత్వ ప్రతిభ జోడించి సినిమాని తారాస్థాయికి చేర్చుతారు. ప్రేక్షకులకు కనీవినీ ఎరుగని సినిమాటిక్ అనుభూతి అందించడంలో శంకర్ దిట్ట. అలాంటి దర్శకుడితో రాంచరణ్ పనిచేస్తుండడంతో RC 15 పై అంచనాలు పెరిగిపోతున్నాయి. శంకర్ సినిమాల్లో హీరోలకు విభిన్నమైన గెటప్స్ ఉంటాయి. మరి ఈ చిత్రంలో శంకర్ చరణ్ ని ఎలా చూప్పించబోతున్నారు అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. 

 

48

మహేష్ - రాజమౌళి : తన ప్రతి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళుతున్న జక్కన్న ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో ఓ మూవీ చేయబోతున్నారు. ఇప్పటి వరకు మహేష్ నటించిన సినిమాలు.. రాజమౌళి తెరక్కించిన సినిమాలకు అసలు పోలికే ఉండదు. అలాంటిది వీరిద్దరూ చేతులు కలిపారు. రాజమౌళి సినిమాలో మహేష్ రోల్ ఏంటి, ఎలా కనిపించబోతున్నాడు, ఎలాంటి కథ అనే ఆసక్తి ఇప్పటి నుంచే మొదలైపోయింది. 

 

58

ప్రభాస్ - నాగ్ అశ్విన్: మహానటి చిత్రంతో అందరిని ఆకర్షించిన దర్శకుడు నాగ్ అశ్విన్. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ చిత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండబోతోందట. కాలంలో ప్రయాణం, వరల్డ్ వార్ ఇలా ఈ చిత్రం గురించి లీకులు వింటుంటే ఎంత త్వరగా ఈ చిత్రం ఫినిష్ అయి రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

 

68

పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి : మాస్ చిత్రాలని మరింత రంజుగా తెరకెక్కించగల దర్శకుడు సురేందర్ రెడ్డి. మాస్, కామెడీ టైమింగ్ లో పవన్ కింగ్. ఇలాంటి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రకటనైతే వచ్చింది.. మరి ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి. 

 

78

విజయ్ - వంశీ పైడిపల్లి : మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఇళయదళపతి విజయ్ కాంబోలో సినిమాకు ప్రకటన రాగానే ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఒక తెలుగు డైరెక్టర్ విజయ్ లాంటి తమిళ స్టార్ హీరోతో ఈ మధ్య కాలంలో సినిమా చేయలేదు. దీనితో ఈ కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

 

88

రామ్ - లింగుస్వామి :తమిళ్ లో లింగుస్వామి పేరున్న మాస్ డైరెక్టర్. రామ్ పోతినేని ఎనెర్జిటిక్ పెర్ఫామెన్స్ ఇవ్వడంలో దిట్ట. వీరిద్దరూ కలిస్తే అంచనాలు పెరగడం ఖాయం. వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం 'ది వారియర్. ఈ మూవీలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. 

 

Read more Photos on
click me!

Recommended Stories