Karthika Deepam: పిల్లలతో విహారయాత్రకు వెళ్లిన వంటలక్క కుటుంబం.. మళ్ళీ విడిపోనున్న కార్తీక్, దీప?

Navya G   | Asianet News
Published : Mar 05, 2022, 10:25 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ కార్తీకదీపం ప్రేక్షకుల అభిమానాన్ని అందుకొని ముందుకు సాగుతున్న ఈ సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం..  

PREV
17
Karthika Deepam: పిల్లలతో విహారయాత్రకు వెళ్లిన వంటలక్క కుటుంబం.. మళ్ళీ విడిపోనున్న కార్తీక్, దీప?

 హిమ ఆనంద్ దూరమయ్యాడని బాధపడుతూ అందరి మీద కోపడుతుంది ఏడుస్తూ తమ్ముడిని తీసుకు వద్దాం రండి అని బతిమిలాడుతూ ఉంటుంది కానీ అందరూ మౌనంగా ఉంటారు అందరి మీద కోపం తెచ్చుకుని నేనే తమ్ముడిని తీసుకొస్తాను అని అక్కడి నుంచి వెళుతుంది.
 

27

 సౌందర్య కార్తిక్ చేతులని పట్టుకుని నేను ఆనంద్ విషయంలో ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించు అని అడుగుతుంది. అలాగే ఇక్కడే ఉంటే పిల్లలు బాధ పడతారు అని ఎక్కడికైనా విహార యాత్రకు  మీ నలుగురు వెళ్ళండి అని కార్తీక్ కు చెప్తుంది.
 

37

 ఇక మోనిత సౌందర్య ఇచ్చిన షాక్ కు తనకు జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ కోపంతో రగిలి పోతూ ఉంటుంది. మోనిత ప్లాన్ ఫెయిల్ అయినందుకు నేను మిమ్మల్ని వదిలి పెట్టాను అంటూ, నాకు ఇంత అవమానం చేసిన వాళ్లని  క్షమించాను అని ఆవేశంతో  గన్ తీసుకుంటుంది.
 

47

 ఇక కార్తీక్, దీపా పిల్లలను తీసుకొని విహార యాత్రకు వెళుతూ ఉంటారు హిమ మాత్రం ఆనంద్ గురించి  ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్, దీపా వారి జీవితంలో జరిగిన సంఘటనల గురించి తలుచుకుంటూ ఉంటారు. హిమ అన్నింటినీ తలచుకుంటున్నారు ఆనంద్ ని మాత్రం తలుచుకోవడం లేదు అని కోపడుతుంది. దాంతో దీపా హిమ మనసును మార్చడానికి నచ్చ చెప్తుంది.
 

57

 కార్తీక్ కూడా హిమ మనసున మార్చడానికి , హిమ సంతోష పడేలా చేయడానికి  హీమకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తాను అంటాడు. దీపా ఎంత చెప్పినా వినకుండా కార్తీక్ హిమ కు కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాడు. హిమకు కార్ డ్రైవింగ్ రాకపోయినప్పటికీ నేర్చుకోవాలని స్పీడ్ గా నడుపుతూ ఉంటుంది. దీప ఎక్కడైతే బంధం విడిపోయింది అక్కడికే వెళ్తున్నాము ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటుంది.
 

67

 సౌందర్య, ఆనందరావు కష్టాలన్నీ తీరి నందుకు గుడిలో పూజ చేయించి పూజారి గారి తో మాట్లాడుతూ ఉంటారు. ఇక పూజారి కుటుంబంతో కలిసి రావాల్సింది అనగా సౌందర్య పూజారి గారికి చెప్తూ కార్తీక, దీప పిల్లలతో యాత్రకు వెళ్లారని వారు ఎక్కడైతే విడిపోయారో అక్కడికే పిల్లలతో పాటు ఇప్పుడు  వెళ్లారు ఆ ఊరే చిక్ మంగుళూరు అని చెప్తుంది.
 

77

 దాంతో పూజారి షాక్ అయ్యి అక్కడికి వెళ్ళటం అంత మంచిది కాదేమో, ఏదైనా ప్రమాదం జరగవచ్చును అని అనిపిస్తుంది. వారిని అక్కడినుంచి తిరిగి వచ్చేయమని చెప్పండి అని సౌందర్యకు చెప్తాడు. ఇక సౌందర్య, ఆనందరావులు పూజారి అలా చెప్పడంతో ఏం జరగబోతోందని కంగారు పడుతూ, భయపడుతుంటారు. మరి రానున్న ఎపిసోడ్లో జరగబోతోందో తెలుసుకోవాల్సిందే.

click me!

Recommended Stories